రమేశ్ పవార్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్... భారత మహిళా టీమ్ రాత మారేనా...

Published : Mar 31, 2022, 05:24 PM IST

ఆట విషయంలో భారత పురుషుల టీమ్‌తో పోటీపడగల సామర్థ్యం భారత వుమెన్స్ టీమ్ సొంతం. అయితే ఆటకు తగ్గ గుర్తింపు, ఆదరణ అయితే ఆడాళ్ల టీమ్‌కి దక్కడం లేదు. అదీకాకుండా భారత పురుషుల టీమ్‌కి ఏరికోరి కోట్లు ఖర్చుపెట్టి హెడ్ కోచ్ వంటి కోచింగ్ స్టాఫ్‌ని, సహాయక సిబ్బందిని పట్టుకొస్తున్న భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)... మహిళా క్రికెట్ టీమ్ విషయంలో మాత్రం అంతటి కేర్ తీసుకోవడం లేదనేది అందరికీ తెలిసిన రహాస్యమే...

PREV
18
రమేశ్ పవార్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్... భారత మహిళా టీమ్ రాత మారేనా...

పురుషుల ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు గడుస్తున్నా, మహిళా ఐపీఎల్ విషయంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. ఇగో ఇప్పుడు, అగో అప్పుడు... అంటే మీనమేషాలు లెక్కిస్తూ మహిళా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో ఎటూ తేల్చడం లేదు బీసీసీఐ...

28

అయితే ఈ మధ్య పురుషుల క్రికెట్‌తో పాటు మహిళా క్రికెట్‌కి ఆదరణ పెరిగింది. వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీ మ్యాచులను క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా వీక్షించారు. అయితే భారత మహిళా జట్టు, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడి... గ్రూప్ దశకే పరిమితమైన విషయం తెలిసిందే...

38

అమ్మాయిల ఆటకు ఆదరణ పెరుగుతుండడంతో భారత మహిళా టీమ్‌ను పటిష్టంగా మార్చేందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు అడుగులు వేస్తోంది బీసీసీఐ. గత ఏడాది భారత మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న మాజీ క్రికెటర్ రమేశ్ పవార్... కాంట్రాక్ట్ గడువు వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీతోనే ముగిసింది..

48

బీసీసీఐ రూల్స్ ప్రకారం రమేశ్ పవార్ కావాలంటే మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బీసీసీఐ మాత్రం కాంట్రాక్ట్ గడువును పొడగించేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మహిళా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పొజిషన్‌ను అప్లికేషన్స్, ఇంటర్వ్యూలతో భర్తీ చేయబోతున్నారు...

58

కావాలంటే రమేశ్ పవార్ మరోసారి ఈ పదవికి అప్లై చేసి, క్రికెట్ అడ్వైసరీ కమిటీ ముందు ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, భారత మహిళా జట్టుకు అవసరమైన మెరుగులు దిద్దేందుకు సిద్ధమవుతున్నాడట...
 

68

వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత అండర్ 19 టీమ్, ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచింది. ఇప్పుడు లక్ష్మణ్ ఫోకస్, భారత మహిళా టీమ్‌పై పడిందట సమాచారం...

78

భారత కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్‌కి దగ్గర్లో ఉన్నారు. ఈ ఇద్దరూ జట్టుకి దూరమైన ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.

88

కాబట్టి భారత పురుషుల టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో సంప్రదింపులు చేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్, మహిళా టీమ్‌ను పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట...

click me!

Recommended Stories