TATA IPL: ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇకనుంచి స్టేడియాలలో మరింత హంగామా

Published : Apr 01, 2022, 06:00 PM IST

TATA IPL2022: మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  అభిమానులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు 25 శాతం మందితోనే నిండిన  స్టేడియాలు ఇకనుంచి... 

PREV
17
TATA IPL: ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇకనుంచి స్టేడియాలలో మరింత  హంగామా

ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.  క్రికెట్ అభిమానులకు వారం రోజులుగా ఆనందాన్ని పంచుతున్న ఈ  లీగ్ లో  గ్రౌండ్ కు వచ్చే ప్రేక్షకుల సామర్థ్యాన్ని పెంచేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. 

27

ఇప్పటివరకు 25 శాతం మాత్రమే ఉన్న క్రౌడ్ కెపాసిటీని ఇకనుంచి 50 శాతానికి పెంచారు. ఏప్రిల్ 6 నుంచి జరుగబోయే మ్యాచులలో  గ్రౌండ్ లలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించుకోవచ్చునని  బీసీసీఐ తెలిపింది. 

37

ఈ మేరకు ఆన్ లైన్ లో ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తున్న ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఈనెల 6  నుంచి జరుగబోయే మ్యాచులకు  స్టేడియాలలో 50 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు.   తద్వారా మరికొంత మంది అభిమానులు ఈ లీగ్ ను దగ్గర్నుంచి చూసే అవకాశం దక్కనుంది..’ అని  తెలిపింది. 

47

ముంబైలోని బ్రబోర్న్, వాంఖెడే, డీవై పాటిల్ తో పాటు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) లో మ్యాచులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

57

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కరోనా నిబంధనలను ఎత్తివేసింది. దీంతో మహారాష్ట్రలో కూడా కొవిడ్ నిబంధనలకు చరమగీతం పాడారు. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలేమీ అమల్లో ఉండవు. 

67

ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు అభిమానులను 50 శాతం వరకు అనుమతించుకునేందుకు బీసీసీఐకి అవకాశం దొరికింది. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి ఐపీఎల్ అభిమానులు  ఆనందంతో  సంబురాలు  చేసుకుంటున్నారు. 

77

ఐపీఎల్ లో ఇప్పటికే పది ఫ్రాంచైజీలన్నీ ఒక మ్యాచ్ ఆడేశాయి. కోల్కతా, పంజాబ్, చెన్నై, లక్నోలు రెండో మ్యాచ్ కూడా ఆడాయి.  బీసీసీఐ తాజా నిర్ణయంతో స్టేడియాలలో ప్రేక్షకుల సందడితో హంగామా నెలకొనడం ఖాయం. 

click me!

Recommended Stories