TATA IPL 2022: రాజస్థాన్ రాయల్స్ తో శనివారం జరుగబోయే మ్యాచుకు ముందు ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులకు శుభవార్త. తొలి మ్యాచులో గాయపడ్డ ఇషాన్ కిషన్ తో పాటు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా తదుపరి పోరుకు సిద్ధమవుతున్నాడు.
ఐపీఎల్-15 సీజన్ లో భాగంగా తమ తొలి మ్యాచులో గాయపడ్డ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఫిట్ గా ఉన్నాడని ఆ జట్టు కోచింగ్ సిబ్బందిలో భాగమైన జహీర్ ఖాన్ అన్నాడు.
28
ఈనెల 2న ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడనుంది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచుకు ముందు ఇషాన్ కిషన్ హెల్త్ అప్డేట్ తో పాటు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా కీలక అప్డేట్ ఇచ్చాడు.
38
ఇటీవలే వెస్టిండీస్ తో సిరీస్ సందర్బంగా గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్.. కొద్దిరోజుల పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో గడిపి ఇటీవలే ముంబైతో చేరాడు. అతడు క్వారంటైన్ కూడా పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ఆడేందుకు సూర్య అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడని జహీర్ చెప్పాడు.
48
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ లో అత్యద్భుతంగా ఆడిన ముంబై.. బౌలింగ్ లో కీలక సమయంలో చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. ఈ మ్యాచులో 48 బంతులెదుర్కున్న కిషన్.. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.
58
అయితే బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో శార్దూల్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్ రెండో బంతి కిషన్ కాలి బొటనవేలుకు బలంగా తాకింది. అయితే ముంబై ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే అతడికి స్కానింగ్ తీయించారు. అయితే కిషన్ కు తాకిన గాయం పెద్దదేమీ కాదని తేలడంతో అతడు కాసేపు విశ్రాంతి తీసుకుని వికెట్ కీపింగ్ చేసేందుకు గ్రౌండ్ కు వచ్చాడు.
68
మధ్యలో కాసేపు కుంటుతూ కనిపించడంతో తర్వాత మ్యాచులో కిషన్ ఆడతాడా..? లేదా..? అన్న అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ పూర్తి క్షేమంగా ఉన్నాడు. అతడు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కిషన్ పూర్తి ఫిట్ గా ఉండటమే గాక తర్వాత మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు..’ అని తెలిపాడు.
78
కాగా.. ఢిల్లీ తో జరిగిన మ్యాచులో 178 పరుగులు చేసినప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. లక్ష్య ఛేదనలో 13 ఓవర్లలో 104కే ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ.. లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) లు అద్భుత పోరాటంతో ఢిల్లీకి విజయాన్ని అందించారు.
88
మరోవైపు తన తొలి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 61 పరుగుల తేడాతో ఓడించి సీజన్ ను ఘనంగా ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్.. విజయోత్సాహంతో బరిలోకి దిగుతున్నది.