మాహీ భాయ్ నాకు ముందే విషయం చెప్పాడు, ఒక్క విజయం వస్తే చాలు... - సీఎస్‌కే కెప్టెన్ రవీంద్ర జడేజా

Published : Apr 04, 2022, 04:42 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో కుదేలైన విషయం తెలిసిందే. 10 జట్లతో సాగే మెగా లీగ్ కావడంతో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలదా? అనేది అనుమానంగా మారింది...

PREV
110
మాహీ భాయ్ నాకు ముందే విషయం చెప్పాడు, ఒక్క విజయం వస్తే చాలు... - సీఎస్‌కే కెప్టెన్ రవీంద్ర జడేజా
Jadeja-Dhoni

కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది...

210

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకి బదులుగా ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ చేస్తూ బౌలర్లను సెలక్ట్ చేయడం, వారికి సూచనలు ఇవ్వడం, ఫీల్డ్ సెట్ చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...
 

310

తాజాగా దీనిపై స్పందించాడు రవీంద్ర జడేజా. ‘లక్నోతో జరిగిన మ్యాచ్‌ హై స్కోరింగ్ గేమ్.. ఆఖర్లో డిప్ మిడ్ వికెట్‌లో క్యాచులు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఓ మంచి ఫీల్డర్ ఉంటే బాగుంటుందని నేనే అక్కడున్నా...

410

కాబట్టి బౌలర్లకు సూచనలు ఇవ్వలేకపోయాను. మాహీ భాయ్ ఆ బాధ్యత తీసుకున్నారు. ఆయనకి ఎంతో అనుభవం ఉంది. మాహీకి మించి, ఎవ్వరైనా ఏం చెప్పగలరు...

510

మాహీ భాయ్ ఓ లెజెండ్. ఎన్నో ఏళ్లుగా కెప్టెన్సీ చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన అనుభవాన్ని వాడుకుంటూ సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటాను...

610

అందరూ అనుకుంటున్నట్టు నేను, ఐపీఎల్‌కి రెండు రోజుల ముందు కెప్టెన్సీ తీసుకోలేదు. కొన్ని నెలల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనను నాతో పంచుకున్నారు మాహీ భాయ్...
 

710

అప్పటి నుంచే కెప్టెన్సీ చేసేందుకు మెంటల్‌గా సిద్ధమయ్యా. టీ20 క్రికెట్‌లో మొమెంటమ్ అందుకోవడానికి ఒకే ఒక్క మ్యాచ్ చాలు. ఒక్క మ్యాచ్ గెలిస్తే, వరుసగా విజయాలు అందుకుంటూ పోతాం...

810

ఆ ఒక్క విజయం కోసమే వెతుకుతున్నాం. జట్టులో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. వారి రోల్స్‌పై వారికి పూర్తి అవగాహన ఉంది. ఆ రిథమ్ అందుకునేందుకు ఎదురుచూస్తున్నాం...

910

ఒకటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రాన తీసి పక్కనబెట్టేయలేం. అందరికీ అవకాశం ఇస్తాం. దీపక్ చాహార్ మా ప్రధాన బౌలర్, అతను త్వరలో టీమ్‌లో చేరతాడని ఆశిస్తున్నాం...

1010

ఒక్క సారి దీపక్ చాహార్ వస్తే మా టీమ్ బలంగా తయారవుతుంది. పవర్ ప్లేలో వికెట్లు తీయడం చాలా అవసరం. ఆ ట్రిక్కు దీపక్ చాహార్‌కి బాగా తెలుసు..’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే నయా సారథి రవీంద్ర జడేజా...

Read more Photos on
click me!

Recommended Stories