అతన్ని చూస్తుంటే మాహీలా కనిపిస్తున్నాడు... షెల్డన్ జాక్సన్‌పై కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

Published : Apr 04, 2022, 04:08 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వికెట్ కీపర్లలో షెల్డన్ జాక్సన్ ఒకడు. దినేశ్ కార్తీక్, ఆర్‌సీబీలోకి వెళ్లిపోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు షెల్డన్ జాక్సన్. గుజరాత్‌లో పుట్టిన ఈ సౌరాష్ట్ర ప్లేయర్‌, 35 ఏళ్ల లేటు వయసులో ఐపీఎల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు...

PREV
17
అతన్ని చూస్తుంటే మాహీలా కనిపిస్తున్నాడు... షెల్డన్ జాక్సన్‌పై కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

2006లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన షెల్డన్ జాక్సన్, ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. 2009లో కేకేఆర్, ఆ తర్వాత ఆర్‌సీబీ... షెల్డన్ జాక్సన్‌ను కొనుగోలు చేసినా పెద్దగా ఛాన్సులు ఇవ్వలేదు...

27

దేశవాళీ టోర్నీల్లో షెల్డన్ జాక్సన్‌‌కి అద్భుతమైన రికార్డు ఉంది. 75 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన షెల్డన్ జాక్సన్, 19 సెంచరీలతో 5634 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 186 పరుగులు...

37

55 లిస్టు ఏ మ్యాచులు ఆడిన షెల్డన్ జాక్సన్, 6 సెంచరీలతో 1869 పరుగులు చేశాడు. 54 టీ20 మ్యాచుల్లో 998 పరుగులు చేశాడు. ఓవరాల్‌కి 100కి పైగా క్యాచులు అందుకున్నాడు...

47

మొదటి రెండు మ్యాచుల్లో కేకేఆర్‌ వికెట్ కీపర్‌గా వికెట్ల వెనకాల అద్భుతమైన కీపింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు షెల్డన్ జాక్సన్... సీఎస్‌కేతో మ్యాచ్‌‌లో మెరుపు స్టంపింగ్‌తో ఊతప్పని పెవిలియన్ చేరాడు షెల్డన్ జాక్సన్..

57

‘షెల్డన్ జాక్సన్ రోజురోజుకీ తనని ఇంత మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు. అతని వయసు ఇప్పుడు 35 ఏళ్లు. అయితే గత రెండేళ్లలో అతని ఆటతీరు చాలా మెరుగైంది...

67

బంతిని స్టేడియం బయటపడేగల బ్యాటర్లలో షెల్డన్ జాక్సన్ ఒకడు. అతనికి రావాల్సినన్ని రాలేదు. అయితే అతన్ని చూస్తుంటే ఎమ్మెస్ ధోనీ గుర్తుకువస్తున్నాడు...

77

బౌలర్లను అర్థం చేసుకుని, వారికి తగ్గట్టుగా తన పొజిషన్స్‌ని మార్చుకుంటాడు జాక్సన్. అతనిలో వయసు పెరిగేకొద్దీ రాణించాలనే కసి, పట్టుదల మరింత పెరుగుతున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

 

Read more Photos on
click me!

Recommended Stories