ఐపీఎల్ 2022 సీజన్‌కి హ్యాట్రిక్ ఓటములతో ప్రారంభించింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ మెగా వేలంలో రూ.14 కోట్లు పోసి కొన్న దీపక్ చాహార్, గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది...
పవర్ ప్లేలో వికెట్లు తీసి, ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయడం దీపక్ చాహార్ స్పెషాలిటీ. దీపక్ చాహార్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా గత సీజన్‌లో సీఎస్‌కేకి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు...
25
యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి గత సీజన్‌లో పరుగుల వరద పారించిన ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్, ఈ సీజన్‌లో సీఎస్‌కేలో లేకపోవడం కూడా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది...
35
‘దీపక్ చాహార్ లాంటి ఒక్క ప్లేయర్‌ని మిస్ అవుతోంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఒక్క ప్లేయర్ లేకుండా వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడం కరెక్టేనా... ఈ టీమ్‌లో మార్పులు అవసరం...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
చెన్నై సూపర్ కింగ్స్ గట్టి కమ్ బ్యాక్స్ ఇవ్వడంలో ఫేమస్ అని తెలుసు. అయితే ఇప్పడున్న పరిస్థితుల్లో చెన్నై కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కష్టం...’ అంటూ ట్వీట్ చేశాడు క్రికెటర్ అమిత్ మిశ్రా...