గతంలో కూడా ఇంతకంటే దారుణ పరాజయాలు.. కానీ కప్పులు కొట్టింది కదా.. ఐదు సార్లు ఛాంపియన్లకు మద్దతుగా ఇర్ఫాన్ పఠాన్

Published : Apr 09, 2022, 06:29 PM IST

TATA IPL 2022 - RCB vs MI: ఈ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు విజయం రుచి చూడలేదు.   శనివారం ఆ జట్టు  రాయల్ చాలెంజర్స్ తో పోటీ పడనున్నది.

PREV
19
గతంలో కూడా ఇంతకంటే దారుణ పరాజయాలు.. కానీ కప్పులు కొట్టింది కదా.. ఐదు సార్లు ఛాంపియన్లకు మద్దతుగా ఇర్ఫాన్ పఠాన్
Rohit Sharma

ఐపీఎల్-2022 సీజన్ లో ఇప్పటివరకు  3 మ్యాచులాడిన ముంబై ఇండియన్స్ ఒక్కదాంట్లో కూడా గెలవలేదు. తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడిన  ఆ జట్టు రెండో మ్యాచులో రాజస్థాన్ తో.. మూడో మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడింది. 
 

29

ఈ మూడింటిలోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. ఇక  శనివారం  రాత్రి రోహిత్  సేన..  ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొననుంది. 

39
Image Credit: Getty Images

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ ఫఠాన్ ముంబై ఇండియన్స్ కు మద్దతుగా నిలిచాడు. ఆ జట్టు  గతంలో కూడా సీజన్ ప్రారంభంలో వరుస మ్యాచులు ఓడినా తర్వాత పుంజుకుని విజయాల బాట పట్టిందని గుర్తు చేశాడు. 

49
IPL retention Mumbai Indians

ఇర్ఫాన్ మాట్లాడుతూ.... ‘ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడటమెలాగో ముంబై ఇండియన్స్ కు బాగా తెలుసు. గతంలో కూడా ఆ జట్టు ఇలాంటి పరాజయాలను ఎదుర్కున్నది. 2014, 2015 లలో  ముంబై  పరిస్థితి దాదాపు ఇప్పటిలాగే (2022) ఉంది. 

59

కానీ వాళ్లు ఆ రెండు సీజన్లలో చివరికి ట్రోఫీ విజేతలుగా నిలిచారు. అయితే అప్పుడున్న జట్టుతో పోలిస్తే ఈ జట్టు కాస్త డిఫరెంట్.  ఈ ఏడాది ముంబైకి జస్ప్రీత్ బుమ్రా తప్ప అతడికి సహకారం అందించే బౌలర్ లేడు.  రోహిత్ శర్మకు పెద్ద తలనొప్పి ఇదే.. 

69

బ్యాటింగ్ లో ముంబైకి సమస్యేలేదు.  మిడిలార్డర్ లో తిలక్ వర్మ చక్కగా ఆడుతున్నాడు.  సూర్యకుమార్ యాదవ్ కోల్కతాపై ఇన్నింగ్స్ లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.   ఓపెనర్ గా వచ్చే ఇషాన్ కిషన్..   మెరుపు ఆరంభాలిస్తున్నాడు. 

79
Image Credit: Getty Images

ఇక  జట్టు సారథి రోహిత్ శర్మ,  బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.  అయితే  ఈ సీజన్ లో  ముంబై ముందుకెళ్లాలంటే ఈ ఇద్దరూ మరింత దూకుడు పెంచాల్సిన అవసరముంది.  

89
Mumbai Indians

అయితే సమస్యంతా బౌలింగ్ దగ్గరే ఉంది.   ఒకప్పుడు భీకరంగా కనిపించిన ముంబై బౌలింగ్ ఇప్పుడు చాలా వీక్ గా ఉంది. ముఖ్యంగా పేస్ విభాగం దారుణంగా ఉంది. బుమ్రా తప్ప చెప్పుకోదగ్గ బౌలరే లేడు. దీంతో అతడికి సహకారం అందడంలేదు. 

99

సహజంగా ముంబై పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి.   దీనిని ఉపయోగించుకుని సీమర్లు చెలరేగితే.. వారికి అండగా స్పిన్నర్ మురుగన్ అశ్విన్ రాణించేందుకు కూడా సిద్ధమవుతాడు.. రాబోయే మ్యాచులలో ముంబై ప్రధానంగా దానిపై ఫోకస్ పెట్టాలి..’ అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. 

click me!

Recommended Stories