Published : Apr 09, 2022, 04:52 PM ISTUpdated : Apr 09, 2022, 05:52 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా మూడు మ్యాచుల్లోనూ నాటౌట్‌గా నిలిచిన దినేశ్ కార్తీక్, రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీకి విజయాన్ని అందించాడు... మరోవైపు ఆయన భార్య దీపికా పల్లికల్, నాలుగేళ్ల తర్వాత బ్యాటు పట్టి డబ్ల్యూఎస్‌ఎఫ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తోంది...
ఇండియన్ వుమెన్ స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్... డబ్ల్యూఎస్‌ఎఫ్ వరల్డ్ డబుల్స్ ఛాంపియన్స్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది...
27
వేల్స్‌కి చెందిన జియోల్ మాకిన్, తెస్కీ ఎవన్స్‌తో జరిగిన సెమీ పైనల్‌లో 11-9, 11-5 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుంది దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ జోడీ...
37
ఫైనల్‌లో నాలుగో సీడ్ ఇంగ్లాండ్ జోడిని 2 వరుస సెట్లలో ఓడించిన దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ జోడీ డబ్ల్యూఎస్‌ఎఫ్ వరల్డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్స్ గెలిచింది...
47
పెళ్లి, గర్భం దాల్చడం, ప్రసవం తదితర కారణాలతో నాలుగేళ్ల బ్రేక్ తర్వాత స్క్వాష్ బ్యాటు పట్టిన దీపికా పల్లికల్, మొదటి టోర్నీలోనే ఫైనల్ చేరి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది...
57
భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ హాట్ గ్లామరస్ ఫోటోలు... (Image: Instagram)
పీసీఏ వుమెన్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచిన దీపికా పల్లికల్, 18 ఫైనల్స్‌లో 11 టైటిల్స్ సాధించింది... ఇది ఆమెకి 12వ టైటిల్.
67
భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ హాట్ గ్లామరస్ ఫోటోలు... (Image: Instagram)
2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాలు గెలిచిన దీపికా పల్లికల్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది..
77
2015లో క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పల్లికల్, 2021 అక్టోబర్ 18న కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. కబీర్, జియాన్ కార్తీక్ అని వీరికి పేర్లు పెట్టారు కార్తీక్, దీపికా...