IPL 2022: కత్తిలా ఉంది.. ఎంతకు కొన్నావ్ బ్రో..? గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ కాస్ట్లీ వాచ్ పై కోహ్లి కామెంట్

Published : Apr 05, 2022, 08:38 PM IST

TATA IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ ఇటీవలే ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి సంబందించి ఓ ఫోటో షూట్ చేశాడు. అందులో అతడు ఓ ఖరీదైన వాచీని ధరించాడు.  

PREV
16
IPL 2022: కత్తిలా ఉంది.. ఎంతకు కొన్నావ్ బ్రో..?  గుజరాత్ టైటాన్స్ ఓపెనర్  కాస్ట్లీ వాచ్ పై కోహ్లి కామెంట్

ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్  తరఫున ఆడుతున్న  శుభమన్ గిల్ లేటెస్ట్  ట్రెండ్ ను ఫాలో అవడంలో ఎప్పుడూ ముందుంటాడు.  నిత్యం ట్రెండీగా కనిపించే గిల్  తాజాగా ధరించిన ఓ  కాస్ట్లీ వాచీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 

26

ఓ మ్యాగజైన్ కు ఫోటో షూట్  చేసిన గిల్.. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ వాచీ ధర ఎంతని  శుభమన్ గిల్ ను టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ప్రశ్నించాడు., 

36

ఇన్ స్టాలో  గిల్ తన ఫోటోను షేర్  చేస్తూ.. ‘నేను నీ  అటెన్షన్ ను కలిగి ఉన్నానా..?’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై కోహ్లి స్పందిస్తూ... ‘నైస్ వాచ్. ఎంత పెట్టి కొన్నావేంటి..?’  అని కామెంట్ చేశాడు.

46

దీనికి శుభమన్ ఆన్సర్ ఇస్తూ...  ‘నాకు ఒక  కింగ్ బహుమతిగా ఇచ్చాడు భయ్యా..’ అని రిప్లై ఇచ్చాడు. గిల్ పోస్టు, విరాట్ కోహ్లి కామెంట్ రెండూ ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  గిల్ కు ఇన్ స్టాలో 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లికి ఏకంగా 188 మిలియన్ల అనుచరులు ఉన్నారు. 

56

ఇదిలాఉండగా.. గిల్ పోస్టుకు అతడు పెట్టిన కామెంట్ ను  చూసి పలువురు నెటిజన్లు ఇది సారా  కోసమే పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.  ‘ఇప్పటికైనా నేను అటెన్షన్ ను కలిగి ఉన్నానా..?’ అని పెట్టింది సారాను ఉద్దేశించే అని  కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. 

66

ఇక ఐపీఎల్ లో శుభమన్ గిల్.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇటీవలే ముగిసిన మ్యాచులో 46 బంతుల్లోనే  84 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నిగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్ లో  డకౌట్ అయినా గిల్ మాత్రం.. రెండో మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. 

Read more Photos on
click me!

Recommended Stories