అతని కెప్టెన్సీ నాకేం నచ్చలేదు, విరాట్ కోహ్లీ చాలా బెటర్... ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లిసిస్‌పై...

Published : Apr 05, 2022, 06:09 PM ISTUpdated : Apr 05, 2022, 06:27 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఫాఫ్ డుప్లిసిస్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసింది ఆర్‌సీబీ... డుప్లిసిస్ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది...  

PREV
19
అతని కెప్టెన్సీ నాకేం నచ్చలేదు, విరాట్ కోహ్లీ చాలా బెటర్... ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లిసిస్‌పై...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 205 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

29

ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు విజృంభించడంతో ప్రత్యర్థిని 128 పరుగులకే కట్టడి చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... అయితే ఈజీ టార్గెట్‌ను ఛేదించడంలో తడబడి ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది...

39

‘విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం వల్ల, డుప్లిసిస్‌కి ఆ బాధ్యతలు వచ్చాయి. విరాట్‌ని ఫాలో అవ్వకుండా డుప్లిసిస్ తన స్టైల్‌లో టీమ్‌ని నడిపిస్తున్నాడు...

49

నాకైతే ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీ పెద్దగా నచ్చడం లేదు. ఎందుకంటే అతని కెప్టెన్సీలో కొత్తదనం కనిపించడం లేదు. స్పెషల్‌గా చెప్పుకోవడానికి ఏమీ ఉండడం లేదు...
 

59

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా టీమిండియాని గెలిపించడానికి, ఆర్‌సీబీకి టైటిల్ గెలవడానికి తన శక్తిమేర ప్రయత్నించాడు. కానీ అదృష్టం తనవైపు నిలవలేదు...

69

ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్‌గా చేసి ఉండొచ్చు కానీ ఐపీఎల్‌లో టీమ్‌ని నడిపించడం వేరు. ఇప్పుడు అతను కొత్తగా మళ్లీ నిరూపించుకోవాల్సి ఉంటుంది... 
 

79

ఇప్పటిదాకా అయితే డుప్లిసిస్ కెప్టెన్సీలో ఎలాంటి మెరుపు నాకు కనిపించలేదు. భారీ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీని నడిపించే బాధ్యత డుప్లిసిస్‌పై ఉంది...

89

దాన్ని డుప్లిసిస్ ఎలా నడిపిస్తాడో చూడాలి.. డుప్లిసిస్, చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా ఏళ్లు ఆడాడు. అక్కడ ఐపీఎల్‌లో టీమ్‌ని ఎలా నడిపించాలో మాహీ నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు...

99

అయినా ఎందుకో ఫాఫ్ డుప్లిసిస్, ఆర్‌సీబీని విజయవంతంగా నడిపించగలడనే నమ్మకం రావడం లేదు. ఒకవేళ అతను అది సాధిస్తే... హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయినా నాకు ఎందుకో డౌటే...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్... 

Read more Photos on
click me!

Recommended Stories