ఐపీఎల్ 2021 సీజన్ రిషబ్ పంత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మారిస్తే, అంతకుముందు 2020 సీజన్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేలా చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్, అక్కడ నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు...
టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీతో పోలికల కారణంగా తీవ్రమైన డిప్రెషన్‌కి లోనై, మూడు ఫార్మాట్లలో చోటు కూడా కోల్పోయాడు...
210
రిషబ్ పంత్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అవుతుండడంతో కెఎల్ రాహుల్‌ని వైట్ బాల్ క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంది టీమిండియా...
310
2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఎమ్మెస్ ధోనీ, టీమిండియాకి దూరం కావడం... రిషబ్ పంత్ పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలు, వికెట్ కీపింగ్‌లో పొరపాట్లతో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు...
410
‘నా కెరీర్‌లో అదో చాలా క్లిష్టమైన సమయం. చాలా డిప్రెషన్‌కి లోనయ్యా, ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు. నాపై వస్తున్న విమర్శలన్నింటికీ సమాధానం చెప్పడం చాలా కష్టంగా అనిపించింది...
510
అయితే నాపై నాకు నమ్మకం ఉంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా నన్ను నేను నియంత్రించుకునేవాడిని...
610
నాకు ఓ అవకాశం వస్తుంది, ఆ రోజు నేనేంటో చూపించాలని ఎదురుచూశా. అప్పుడు రోహిత్ భాయ్, మాహీ భాయ్‌లతోనే కాస్త మాట్లాడేవాడిని...
710
Rishabh Pant
చాలా వరకూ నా ఆత్మవిశ్వాసంపైనే భరోసా ఉంచాను. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేయడం చాలా ఆత్మసంతృప్తినిచ్చింది... ఆ పరిస్థితులను ఎదుర్కోవడమే చాలా పెద్ద ఛాలెంజ్...
810
అయితే నేనెప్పుడూ హాఫ్ సెంచరీలు, సెంచరీల గురించి ఆలోచించలేదు. ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనే ఆలోచనే నా బుర్రలో తిరుగుతూ ఉంటుంది...
910
అయితే క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడకుండా కంట్రోల్ చేసుకోలేదు. అయితే ఇంగ్లాండ్ సిరీస్‌లో 101 బంతుల్లో 50 పరుగులు చేసినప్పుడు నన్ను నేను షాట్స్ ఆడకుండా పూర్తిగా నియంత్రించుకున్నా...
1010
ఆ ఇన్నింగ్స్ కారణంగా నేను ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయగలననే నమ్మకం నాలో పెరిగింది... ’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్...