ఐపీఎల్ 2022 సీజన్‌లో సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగుతున్నాడు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 41 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు...
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చూడచక్కని షాట్లతో రెండు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో షెల్డన్ జాక్సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
29
ఐపీఎల్‌లో ఆర్‌సీబీలో కీలక సభ్యుడిగా ఉన్న యజ్వేంద్ర చాహాల్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే...
39
అలాగే గత సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున బరిలో దిగిన దేవ్‌దత్ పడిక్కల్, నవ్‌దీప్ సైనీ కూడా ఈ సారి రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నారు. దీంతో ఆర్‌సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌పై భారీ అంచనాలు పెరిగాయి..
49
‘విరాట్ కోహ్లీ ఏ విషయాల గురించి ఆలోచించకుండా తన ఆట తను ఆడాలి. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బాగా ఆడాడు... తన కాళ్లను చక్కగా వాడుకున్నాడు...
59
విరాట్ కోహ్లీ ఎప్పుడూ బిజీగా కనిపిస్తే, అతని నుంచి అద్భుతమైన షాట్స్ చూసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ ఉంటే మంచిది...
69
రాజస్థాన్ రాయల్స్‌లో ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. అందులోనూ యజ్వేంద్ర చాహాల్, ఆర్‌సీబీలో చాలా కాలం ఉన్నాడు. కాబట్టి విరాట్ కోహ్లీ వీక్‌నెస్‌లు అతనికి తెలిసే ఉండొచ్చు...
79
అలాగే అశ్విన్, విరాట్ చాలాకాలంగా ఆడుతున్నారు. అయితే ఈ ఇద్దరి గురించి ఆలోచించకుండా విరాట్ తన ఆటపై ఫోకస్ పెడితే బెటర్...
89
స్పిన్నర్ల బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ స్వీప్ షాట్స్ ఆడడని అందరూ అనుకుంటారు. కాబట్టి ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కూడా సరిగ్గా ఉంటాయి. ఒక్కసారి స్వీప్ షాట్స్ ఆడడం మొదలెడితే, ఫీల్డర్లను మార్చాల్సి ఉంటుంది...
99
అప్పుడు నీకు ఎదురే ఉండదు. ఏ స్పిన్నర్ అయినా, ఏ బౌలర్ అయినా నిన్ను ఆపలేరు...’ అంటూ విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...