లక్నో తో ఆడిన మ్యాచ్ లో నాలుగు పరుగులే చేసినా.. తర్వాత కోల్కతా తో మ్యాచ్ లో 45 బంతుల్లో 61 పరుగులు చేయగా.. తర్వాత బెంగళూరుతో 38 బంతుల్లోనే 66 రన్స్ చేశాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్న వార్నర్.. పంజాబ్ తో మ్యాచ్ లో కూడా చెలరేగాలని ఢిల్లీ అభిమానులు కోరుకుంటున్నారు.