ఇదేం చెత్త అంపైరింగ్... ఐపీఎల్ 2022లో అంపైర్ తప్పిదాలపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్...

Published : Apr 20, 2022, 06:05 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై పెద్ద చర్చే జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జోష్ హజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్‌ మొదటి బంతికి వైడ్ ఇవ్వకపోవడం... మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేసింది...

PREV
18
ఇదేం చెత్త అంపైరింగ్... ఐపీఎల్ 2022లో అంపైర్ తప్పిదాలపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్...

మొదటి బాల్‌కి వైడ్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన మార్నస్ స్టోయినిస్, ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అవుటైన తర్వాత అంపైర్‌ని బూతులు తిడుతూ పెవిలియన్ చేరాడు స్టోయినిస్...

28

కీలక సమయంలో స్టోయినిస్ అవుట్ కావడం, ఆ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది...

38

అంతకుముందు బ్యాటుకి తగలకపోయినా ఎల్బీడబ్ల్యూగా అవుట్‌గా ఇవ్వడం... బ్యాటుకి తగిలిన బాల్స్‌కి ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడం వంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి...

48

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ఇచ్చిన నిర్ణయంపై కూడా వివాదం రేగింది. డీఆర్ఎస్ తీసుకున్నా విరాట్‌కి నిరాశే ఎదురైంది...

58

బిగ్‌బాష్ లీగ్‌లో అంపైర్ల నిర్ణయాలపై పెద్ద చర్చే జరిగింది. దానితో పోలిస్తే ఐపీఎల్‌‌లో అంపైరింగ్ నిర్ణయాలు మెరుగ్గానే ఉంటాయని ప్రశంసలు దక్కాయి. అయితే ఈసారి సీన్ మారిపోయింది.  

68

ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్లలో అంపైరింగ్ స్టాండర్డ్స్‌‌తో పోలిస్తే ఈ సారి అంపైర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్... ఆగ్రహం వ్యక్తం చేశాడు...

78

‘ఐపీఎల్‌లో అంపైరింగ్‌కి ఏమైంది? ఇది చాలా దారుణం. కొన్నిసార్లు చిన్న నిర్ణయాలు, పెద్ద పెద్ద తప్పిదాలకు కారణమవుతాయి...

88

ఇప్పటికైనా నిద్రలేవండి. రిఫరీగా ఉండదగ్గ వ్యక్తులను గుర్తించి వారిని రిఫరీలుగా పెట్టండి...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...

click me!

Recommended Stories