KL Rahul: పెళ్లికి బాజా మోగింది.. చలికాలంలో లక్నో సారథి వివాహం.. పనులు షురూ..!

Published : Apr 20, 2022, 06:00 PM IST

KL Rahul-Athiya Shetty Marriage: గత కొంతకాలంగా ప్రేమలోకంలో విహరిస్తున్న  లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ - అతియా శెట్టి లు ఇక ఆ ఛాప్టర్ కు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారు. 

PREV
16
KL Rahul: పెళ్లికి బాజా మోగింది.. చలికాలంలో లక్నో సారథి వివాహం.. పనులు షురూ..!

టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు.  మూడేండ్లుగా   బాలీవుడ్  సీనియర్ హీరో సునీల్ శెట్టి  కూతురు అతియా శెట్టి  ప్రేమలో మునిగి తేలుతున్న రాహుల్.. ఈ ఏడాది చివర్లో ఆమెను పెళ్లి చేసుకోనున్నాడు. 

26

2019 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట ఇక ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లికి సిద్ధమవ్వాలని నిర్ణయించుకుంది.  రాహుల్ ఇటీవలే  30వ పడిలోకి వచ్చాడు.  దీంతో అతడికి ఇక పెళ్లి చేసేయాలని  రాహుల్ తల్లిదండ్రులు భావిస్తున్నారు. 

36

ఈ ఏడాది చివర్లో.. శీతాకాలం సీజన్ లో ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్టు  ప్రముఖ వెబ్ సైట్ 'పింక్ విల్లా' ఓ కథనంలో పేర్కొంది. దక్షిణ భారత వివాహ సాంప్రదాయంలో రాహుల్-అతియాల పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు  అనుకుంటున్నట్టు ఆ కథనం  తెలిపింది. 

46

ఇదే విషయమై రాహుల్ కుటుంబసభ్యులు  స్పందిస్తూ.. ‘ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టాం. రాబోయే చలికాలంలో  రాహుల్- అతియా ల పెళ్లి  ఉంటుంది..’ అని చెప్పినట్టు సమాచారం. 

56

కర్నాటక లోని మంగళూరుకు చెందిన సునీల్ శెట్టి.. బాలీవుడ్ లో అగ్రహీరోగా ఎదిగిన ఇప్పటికీ  దక్షిణ భారత సాంప్రదాయాలనే పాటిస్తాడు. అలాగే కెఎల్ రాహుల్ కూడా కర్నాటక వాస్తవ్యుడే.   అతడిది కూడా మంగళూరే కావడం తో వీరి వివాహం అచ్చమైన కన్నడ సాంప్రదాయంలో  జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. 

66

ఈ వార్తలు నిజమైతే గనక  ఆస్ట్రేలియాలో జరిగే  టీ20 ప్రపంచకప్ (అక్టోబర్) తర్వాత రాహుల్ పెళ్లి కొడుకయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  గతేడాది దుబాయ్ లో ముగిసిన  పొట్టి ప్రపంచకప్ లో అవమానకర రీతిలో ఓడిన టీమిండియా ఈసారి మాత్రం  కప్ కొట్టాలని భావిస్తున్నది. 

click me!

Recommended Stories