ఐపీఎల్ 2022 సీజన్‌ను ఎన్నో ఆశలు, అంచనాలతో మొదలెట్టాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి ఎమ్మెస్ ధోనీ తప్పుకోవడంతో, సీఎస్‌కే కెప్టెన్‌గా చక్రం తిప్పాలని భావించాడు. అయితే ఆ ముచ్చట కొన్ని రోజుల్లోనే మాయమైంది...
కేకేఆర్‌తో మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది...
28
కెప్టెన్సీ చేసి పరాజయాలు వస్తే పర్లేదు కానీ, ఆన్ ఫీల్డ్ నాటకమంతా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ నడిపిస్తుంటే... నామమాత్రపు కెప్టెన్‌గా జడ్డూ, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
38
కెప్టెన్సీ భారం కారణంగా తన సహజమైన ఆటకు దూరమైన రవీంద్ర జడేజా... అటు బ్యాటుతో కానీ ఇటు బంతితో కానీ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...
48
అన్నింటికీ మించి ఫీల్డ్‌లో చిరుతలా కదుతులూ మిగిలి ప్లేయర్లలో ఎనర్జీని నింపే రవీంద్ర జడేజాలో మునుపటి ఫైర్ కనిపించడం లేదు...
58
Ravindra Jadeja
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కావడంతో రవీంద్ర జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు...
68
చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకే తిరిగి కెప్టెన్సీ అప్పగించాలని ‘కెప్టెన్ ధోనీ’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు సీఎస్‌కే అభిమానులు...
78
చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల కారణంగా సురేష్ రైనా కూడా మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు. సురేష్ రైనా లేకపోవడం వల్లే ఐపీఎల్ 2020 సీజన్‌లో లాగే సీఎస్‌కే వరుస పరాజయాలు అందుకుంటోందని వాదిస్తున్నారు ‘చిన్నతలా’ ఫ్యాన్స్...
88
సురేష్ రైనా టీమ్‌లో ఉన్న ప్రతీ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ చేరిందని, ఒక్క సీజన్‌లో పర్ఫామెన్స్ బాగోలేదని ‘మిస్టర్ ఐపీఎల్’ను పక్కనబెట్టడం వల్లే వరుస మ్యాచుల్లో ఓడుతుందని అంటున్నారు సీఎస్‌కే వీరాభిమానులు..