మాట్లాడేవాళ్లు లేరు, ఎందుకు సెలక్ట్ చేయలేదో తెలీదు... 2011 వరల్డ్ కప్‌ గురించి రోహిత్ శర్మ ఎమోషనల్...

Published : Apr 03, 2022, 06:49 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ విజయానికి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది భారత జట్టు... 28 ఏళ్ల తర్వాత భారతీయుల కలలను నెరవేరుస్తూ, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...

PREV
111
మాట్లాడేవాళ్లు లేరు, ఎందుకు సెలక్ట్ చేయలేదో తెలీదు... 2011 వరల్డ్ కప్‌ గురించి రోహిత్ శర్మ ఎమోషనల్...

2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన రోహిత్ శర్మ, అటు స్పిన్నర్‌గా, ఇటు బ్యాటర్‌గా నిరూపించుకున్నా... 2011 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

211

విరాట్ కోహ్లీ, 2011 వన్డే వరల్డ్ కప్ ఆడడం, మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి రికార్డు క్రియేట్ చేయడం... ఫైనల్‌ మ్యాచ్‌లో గంభీర్‌తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి 35 పరుగులు చేయడం కూడా క్రికెట్ ఫ్యాన్స్‌కి గుర్తుండే ఉంటుంది...

311

అయితే విరాట్ కోహ్లీకి సమవుజ్జీగా, టీమిండియాలో అసలైన పోటీదారుడిగా మారిన రోహిత్ శర్మకు వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీలో చోటు దక్కలేదు. కెరీర్ ప్రారంభంలో రోహిత్, నిలకడైన ప్రదర్శన కనబరచకపోవడమే దీనికి కారణం...

411
Rohit Sharma

‘వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ గెలిచిన జట్టులో నేను లేననే నిజాన్ని జీర్ణించుకోవడం ఇప్పటికీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ ఆడాలనేది నాకు చిన్ననాటి కల...

511

2011 వన్డే వరల్డ్ కప్‌కి జట్టును ప్రకటించిన సమయంలో నేను సౌతాఫ్రికాలో ఉన్నా, మేం సిరీస్ ఆడుతున్నాం. నాకు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు లేదని తెలిసి చాలా కృంగిపోయా...

611
Rohit Sharma

అయితే నాతో మాట్లాడడానికి కానీ, ధైర్యం చెప్పడానికి కానీ ఎవ్వరూ లేరు. నా రూమ్‌లో ఒంటరిగా కూర్చొని, ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించా... ఆ ఆలోచనే నా ఆటను మార్చివేసిందనుకుంటా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత నయా సారథి రోహిత్ శర్మ..

711

‘వన్డే వరల్డ్‌కప్ 2011 కోసం మేం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశాం. సీనియర్లతో పాటు జూనియర్లతో నిండి సమతూకంతో ఉండేలా జట్టు కూర్పు ఉండాలని భావించాం... అయితే రోహిత్ శర్మ అప్పటికి బ్యాట్స్‌మెన్‌గా పెద్దగా నిరూపించుకోలేదు.

811

14 మంది ప్లేయర్లను వారి పర్ఫామెన్స్, అనుభవం కారణంగా తీయలేని,పెట్టలేని పరిస్థితి. ఇక మిగిలిన ఒక్క స్పాట్. 15వ ప్లేయర్‌గా రోహిత్ శర్మ, పియూష్ చావ్లా మధ్య పోటీ నడిచింది...

911

మేం (సెలక్టర్లు) రోహిత్ శర్మ కావాలని అన్నాం, అయితే జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం పియూష్ చావ్లాకే ఓటు వేసింది. అప్పటికే మంచి అనుభవం ఉన్న స్పిన్నర్ మాత్రమే కాకుండా చావ్లా కీలక సమయాల్లో బ్యాటింగ్‌లోనూ రాణించగలడు.

1011

రోహిత్ శర్మలో చాలా టాలెంట్ ఉంది. అతనో క్లాస్ ప్లేయర్. అయితే అప్పటిదాకా టీమిండియా తరుపున అతను నమోదుచేసిన రికార్డులు మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే, మెరుగ్గా లేవు. దీంతో మేం రోహిత్ శర్మ కావాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయాం... ’ అంటూ కామెంట్ చేశాడు అప్పటి సెలక్టర్, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్..

1111

2011 వన్డే వరల్డ్‌కప్‌ తుది 15 మంది జట్టులో ఎంపిక కానందుకు తెగ ఫీలైన రోహిత్ శర్మ , 2019 వన్డే వరల్డ్‌కప్‌‌‌లో వరుసగా ఐదు సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories