ఇక ఈ సీజన్ లో చెన్నై వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడానికి గల కారణాలు, ఆ ఓటములు జట్టుపై పడే ప్రభావం గురించి హస్సీ స్పందించాడు. ‘అది మాకు అలవాటే. గతంలో కూడా మేము సీజన్ ప్రారంభ మ్యాచులలో ఓడాం. మేం వాటి గురించి పెద్దగా పట్టించుకోం. తొలుత జరిగే మ్యాచులు మా ప్రణాళిక ప్రకారం జరుగవు. దాని గురించి పెద్దగా చింతించాల్సిన పన్లేదు. త్వరలోనే మా అసలైన ఆటను బయటపెడతాం...’అని తెలిపాడు.