రోహిత్ శర్మ సక్సెస్‌కి ఆ ఆస్ట్రేలియా ప్లేయరే కారణం... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

Published : Nov 21, 2021, 06:04 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నాడు.. అయితే రోహిత్ సక్సెస్ వెనకాల ఓ ఆసీస్ ప్లేయర్ ఉన్నాడట...

PREV
111
రోహిత్ శర్మ సక్సెస్‌కి ఆ ఆస్ట్రేలియా ప్లేయరే కారణం... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

2007లో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక వన్డే ద్వారా ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, జట్టులో సుస్థిరమైన స్థానం సంపాదించడానికి ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది...

211

నిలకడైన పర్ఫామెన్స్ లేని కారణంగా 2011 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ కంటే సీనియర్ అయిన రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ కెరీర్ గ్రాఫ్‌ని మార్చింది ఐపీఎల్ పర్ఫామెన్సే...

311

2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టుతో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2010 వరకూ ఆ జట్టులోనే ఉన్నాడు. ఆ తర్వాతి సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి మారాడు...

411

‘ఐపీఎల్ 2009 సీజన్‌లో డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడంలో కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా కీ రోల్ పోషించాడు...

511

అప్పుడు డెక్కన్ ఛార్జర్స్ టీమ్‌లో వీవీఎస్ లక్ష్మణ్, హర్షల్ గిబ్స్, డ్వేన్ స్మిత్, స్కాట్ స్టైయిరిస్, ఆండ్రూ సైమండ్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్ వంటి ఫారిన్ స్టార్ ప్లేయర్లు పుష్కలంగా ఉండేవాళ్లు...

611

అయితే జట్టులో ఎంత మంది సీనియర్లు ఉన్నా, గిల్‌క్రిస్ట్, రోహిత్ శర్మను ఎక్కువగా ప్రోత్సహించేవాడు. రోహిత్‌లోని కెప్టెన్సీ స్కిల్స్‌ని ముందుగానే పసిగట్టిన గిల్‌క్రిస్ట్, అతనికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు..

711

నా వరకైతే రోహిత్ శర్మ కెరీర్‌ను మార్చింది రోహిత్ శర్మనే. ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్, అతని యాటిట్యూడ్‌ని గిల్లీ బాగా స్టడీ చేసేవాడు... 

811

మరింత మెరుగ్గా మార్చుకోవడానికి ఎలాంటి మార్పులు చేయాలో సలహాలు ఇచ్చేవాడు. రోహిత్ శర్మ కూడా ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇచ్చే సూచనలను బాగా పాటించేవాడు...

911

ఇప్పుడు రోహిత్ శర్మ, టీమిండియాకి స్టార్ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా మారాడంటే దానికి కారణం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రోత్సాహమే...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా...

1011

ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో పాటు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడిన ప్రజ్ఞాన్ ఓజా, ఆ తర్వాత 2012 నుంచి 2015 వరకూ ముంబై ఇండియన్స్ తరుపున ‘హిట్‌మ్యాన్’తో కలిసి ఆడాడు...

1111

ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున మూడు సీజన్లు ఆడిన రోహిత్ శర్మ, 1170 పరుగులు చేశాడు. డీసీ హైదరాబాద్ టైటిల్ గెలిచిన 2009 సీజన్‌లో హ్యాట్రిక్ తీసిన రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులకే 4 వికెట్లు తీశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories