ఈ మాత్రం దానికి వరల్డ్ కప్ టోర్నీ ఎందుకు... టాస్ గెలిచిన వాళ్లకు టైటిల్ ఇచ్చేస్తే, సరిపోయేదిగా...

First Published Nov 21, 2021, 5:13 PM IST

టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో గత ఆరు సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా, ఈసారి ఆ లోటు తీర్చుకుంది ఇప్పటికే ఐదు వన్డే వరల్డ్‌కప్స్ గెలిచిన ఆసీస్‌కి ఇది ఆరో ప్రపంచకప్. అయినా ఈ విజయం కిక్ ఇవ్వడం లేదంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ప్రతీ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే, అది కచ్ఛితంగా ‘టాస్’... టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రతీ జట్టు విజయాన్ని అందుకుంది, ఆఖరి సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లో కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యింది...

సూపర్ 12 రౌండ్‌లో జరిగిన 33 మ్యాచుల్లో 22 సార్లు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లకే విజయాలు దక్కాయి. ఇందులో ఒక్కటే ఒక్క మ్యాచ్‌లో ఓ పెద్ద జట్టు. టాస్ గెలిచినా సరే, ఓటమి పాలైంది..

సూపర్ 12 రౌండ్ గ్రూప్ 1లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ను కట్టడి చేసి ఆఖరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. అది మినహా మిగిలిన 10 మ్యాచుల్లో టాస్ గెలిచినా, మ్యాచ్ ఓడిన జట్లన్నీ చిన్నచిన్న టీమ్స్...

సూపర్ 12 రౌండ్ గ్రూప్ 1లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ను కట్టడి చేసి ఆఖరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. అది మినహా మిగిలిన 10 మ్యాచుల్లో టాస్ గెలిచినా, మ్యాచ్ ఓడిన జట్లన్నీ చిన్నచిన్న టీమ్స్...

సరైన ఫామ్‌లో లేని శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు పసికూన జట్లైన ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లు మాత్రమే టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోయాయి...

ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుపై ఇప్పటిదాకా విజయం సాధించని పాకిస్తాన్, 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవడంలో టాస్ చాలా కీలక పాత్ర పోషించింది...

అంతేకాకుండా ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్‌ని ఓడించని ఇంగ్లాండ్ జట్టు, ఈసారి వారిని చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోగలిగింది. ఈ రివెంజ్‌ డ్రామాలో టర్నింగ్ పాయింట్ కూడా ‘టాస్’...

ఆఖరికి సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌ కూడా టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టుకి విజయాలు దక్కాయంటే... ‘టాస్’ ఎంత కీలక పాత్ర పోషించిందో అర్థం చేసుకోవచ్చు...

‘ఆస్ట్రేలియా, దాదాపు దశాబ్దం తర్వాత ఓ మేజర్ ట్రోఫీ గెలిచింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌ కప్... ఉన్నంతలో బౌలర్లను చక్కగా వాడుకుంటూ, బౌండరీలు బాదుతూ ట్రోఫీ గెలిచేశారు...

అన్నింటికీ మించి టాస్ గెలవడంలో ఆసీస్ చాలా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ఈ టోర్నీలో జరిగిన చాలా మ్యాచులు ‘టాస్ గెలవండి, మ్యాచ్ గెలవండి’లా సాగాయి...

ఈ మాత్రం దానికి వరల్డ్ కప్ టోర్నీ పెట్టడం ఎందుకు. టాస్ అనేది మ్యాచ్ రిజల్ట్‌లో మహా అయితే 10 శాతం ప్రభావం చూపించాలి. కానీ టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో అలా జరగలేదు... 

టాస్ గెలిస్తే చాలు, మ్యాచ్ గెలిచినట్టు అయిపోయింది. టీ20 ఫార్మాట్‌ను మరింత మెరుగ్గా చేయడానికి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందేమో. లేదంటే టాస్ ప్రాధాన్యం బాగా పెరిగిపోతుంది...

బౌండరీల సైజుని తగ్గించి, పవర్ ప్లేలు తీసుకు రావడం వల్ల బౌలర్లకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. మిడిల్ ఓవర్లలో బౌండరీలు రావడం మజాని పెంచుతుంది.

అయితే బౌండరీలు ఇవ్వడం కోసం క్రికెట్ నిబంధనలను మారిస్తే, బౌలర్లు కేవలం పరుగులు ఇచ్చే మెషిన్‌లుగా మారతారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్...

click me!