కోహ్లీ, రోహిత్, రాహుల్.. వారిలో టాలెంట్ మరీ ఎక్కువైంది... టీమిండియా అసలు సమస్య అదే...

First Published Nov 21, 2021, 4:26 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, షమీ... ఇలా స్టార్లతో నిండిన జట్టు... గ్రూప్ స్టేజీకే పరిమితమై, ఘోర పరాభవంతో స్వదేశానికి తిరిగి వచ్చింది...

2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత గత 8 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోతోంది భారత జట్టు. ద్వైపాక్షిక సిరీస్‌లు, వార్మప్ మ్యాచుల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇస్తున్న భారత స్టార్ ప్లేయర్లు, కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్నారు...

సత్తా ఉన్న ప్లేయర్లు పుష్కలంగా ఉన్న భారత జట్టు, ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్ అవ్వడానికి టాలెంట్ మరీ ఎక్కువవ్వడమే అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

‘కొన్నిసార్లు టాలెంట్ మరీ ఎక్కువైనా సమస్యే... ఇప్పుడు టీమిండియా సమస్య కూడా అదే. ప్రస్తుతం భారత జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు దక్కింది...

వారితో పాటు మరికొందరు కుర్రాళ్లు టీమ్‌లో ప్లేస్ దక్కించుకుంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ కూడా అప్పుడప్పుడూ మాత్రమే టీమ్‌లోకి వస్తున్నాడు... 

ఫెయిల్ అయినా సరే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్‌ను టీమిండియా పక్కన పెట్టలేదు. అలాగే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌ల విషయంలో కూడా అంతే... 

హార్ధిక్ పాండ్యాకి టీ20 వరల్డ్‌ కప్ టీమ్‌లో చోటు ఇచ్చారు. అతను బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోయినా, వికెట్లు తీయలేకపోయినా అతన్నే ఆడించారు....

హార్ధిక్ పాండ్యా స్థానంలో ఎందరో యువ క్రికెటర్లను ఆడించొచ్చు. కానీ టీమిండియాలో అలా చేయడం వీలుకాదు. ఎందుకంటే ఆ జట్టులో స్టార్లు ఎక్కువగా ఉన్నారు...

సీనియర్లు సరిగా ఆడనప్పుడు, వారిని పక్కనబెట్టి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే సీనియర్లకు కూడా సరిగా ఆడాలనే కసి, పట్టుదల పెరుగుతాయి. అయితే భారత జట్టు విషయంలో ఇది చాలా పెద్ద విషయం...

సీనియర్లు సరిగా ఆడలేదని పక్కనబెడితే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వారిలో టాలెంట్ లేదని కాదు, మరీ ఎక్కువగా ఉంది. దాన్ని సరిగా వాడుకోవడమే వారికి తెలియడం లేదు...

ఒక్కోసారి టీమిండియాలో ఉన్న ప్లేయర్లను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇంతమంది టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లు ఉన్నారేంటా? అని... 

అయితే భారత జట్టుకి వారిని సరిగా వాడుకోకపోవడం తెలియకపోవడం మిగిలిక జట్లకు మంచిదే...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండేందుకు బీసీసీఐ పెద్దలు తనను సంప్రదించారని చెప్పిన రికీ పాంటింగ్, కుటుంబంతో గడిపే ఆనందక్షణాలను మిస్ చేసుకోవడం ఇష్టం లేక, ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలిపాడు...

టీమిండియాలో ఫెయిల్ అవుతూ వస్తున్న శిఖర్ ధావన్, పృథ్వీషా, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు, రికీ పాంటింగ్ కోచింగ్‌లో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ గత రెండు సీజన్లలోనూ 550+కి పైగా పరుగులు చేశాడు...

click me!