అంతా మాహీ వల్లే అన్నారు, టీమిండియా ఓడిపోతుంటే మెంటర్‌ని చూపించలేదేం... టీమిండియా ఫ్యాన్స్‌లో..

First Published Oct 25, 2021, 11:25 PM IST

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచుల్లో సంగతి... బ్యాట్స్‌మెన్ సిక్సర్ కొట్టినా, బౌలర్ వికెట్ తీసినా, ఫీల్డర్ బంతిని ఆపినా... వాళ్లకంటే ఎక్కువగా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఎక్కువగా చూపిస్తూ, ధోనీ నామస్మరణే చేశారు కామెంటేటర్లు... అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో మాత్రం సీన్ మారిపోయింది... 

మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ డకౌట్ కావడం, కెఎల్ రాహుల్ మూడు పరుగులకే పెవిలియన్ చేరడంతో టీమిండియా ఫెయిల్యూర్‌ ఫిక్స్ కావడంతో కెమెరాల్లో ఎక్కడా మెంటర్ మాహీ కనిపించలేదు...

వార్మప్ మ్యాచుల్లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇరగదీస్తుంటే... ప్రతీసారీ ఎమ్మెస్ ధోనీని ఫోకస్ చేసి మరీ చూపించిన కెమెరామెన్లు... పాక్‌తో మ్యాచ్ సమయంలో పెద్దగా మెంటర్‌ను పట్టించుకోలేదు...

ఇన్నింగ్స్ మొత్తం పూర్తయిన తర్వాత హుందాగా క్రీజులోకి వచ్చి పాక్ క్రికెటర్లకు ఎంతో విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ‘క్రికెట్ స్పిరిట్’ మార్కులు మాత్రమే కొట్టేశాడు మెంటర్ ధోనీ...

నిజానికి టీ20 వరల్డ్‌కప్ జట్టు సెలక్షన్ విషయంలోనే కాకుండా బౌలింగ్‌ విషయంలోనూ ఏ ఓవర్ ఎవరితో వేయించాలనే దానిపై మహేంద్ర సింగ్ ధోనీ చాలా చొరవ తీసుకున్నాడు...

సాధారణంగా విరాట్ కోహ్లీ అయితే జస్ప్రిత్ బుమ్రా ఓపెనింగ్ ఓవర్ వేయించేవాడు. అయితే ఎమ్మెస్ ధోనీ మాత్రం ఫామ్‌లో లేని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో వేయించాలని సూచించాడట..

ఫలితం భువీ మొదటి ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో 10 పరుగులు సమర్పించి, కాస్తో కూస్తో ఒత్తిడిలో ఉన్న పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కి ఫుల్లు కాన్ఫిడెన్స్ ఇచ్చేశాడు... ఆ తర్వాత అతను వీరబాదుడు బాదిన సంగతి తెలిసిందే..

వార్మప్ మ్యాచుల్లో టీమ్ గెలిచిన ప్రతీసారీ మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాజిక్ వల్లే... మాహీ వచ్చాడు, జట్టులో మహేంద్ర జాలం చేశాడని ఊదరగొట్టిన కామెంటేటర్లు, ఓడిన సమయంలో మాహీ గురించి ఎందుకు మాట్లాడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ఓటమికి కేవలం రెండే రెండు కారణాలు... ఒకటి టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ కాగా, మరోటి పాకిస్తాన్ జట్టు నమ్మకం, క్రమశిక్షణ...

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్... పాక్ బౌలర్లను ఎదుర్కోలేక వెంటవెంటనే పెవిలియన్ చేరాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత రిషబ్ పంత్, అనవసర షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

అదే పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ ఆడిన తీరు చూస్తుంటే... భారత ఫీల్డర్లకు ఒక్క క్యాచ్ అవకాశం కూడా ఇవ్వలేదు. ఫీల్డర్లు ఎక్కడెక్కడున్నారో, ఏ ఏరియాల్లో షాట్స్ ఆడాలో తెలిసినట్టు బ్యాటింగ్ చేశారు...

బుమ్రా మ్యాజిక్ చేస్తాడు, షమీ వికెట్లు తీస్తాడు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తాడని... ఒక్క బ్రేక్ త్రూ లభిస్తే చాలు, పాక్ జట్టును చుట్టేయొచ్చని ఆశించిన భారత జట్టుకి ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ ఫినిష్ చేస్తారు వారి ఓపెనర్లు...

కాబట్ట టీమిండియా ఓడినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్లే ఓడిందని ట్రోల్ చేసే మాహీ ఫ్యాన్స్... జట్టు గెలిస్తే, సమిష్టంగా గెలిచిందని, ఓడితే కూడా సమిష్టి వైఫల్యం కారణంగానే ఓడిందని గుర్తించాలని కోరుతున్నారు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచినప్పటికీ, అందులో కెప్టెన్‌గా మహీ పాత్ర చాలా తక్కువ. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా ఫెయిల్ అయిన మాహీ, కెప్టెన్‌గా మాత్రం టైటిల్ అందుకోగలిగాడని తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి...

ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి మెంటర్‌గా బాధ్యతలు తీసుకోవడం వల్ల పాకిస్తాన్‌పై మ్యాచ్ తర్వాత మళ్లీ అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా వస్తోంది... 

click me!