రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కుదురుకోగలడా... అప్పుడు సచిన్ టెండూల్కర్ చేసిందే, ఇప్పుడు కోహ్లీ...

First Published Nov 11, 2021, 4:39 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత జట్టు టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్నా, ఆ తర్వాత జరిగే సౌతాఫ్రికా టూర్‌లో అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది...

కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్, ఓ సాధారణ ప్లేయర్‌గా మరో క్రికెటర్ కెప్టెన్సీలో ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకుముందు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వంటి ప్లేయర్లు ఈ ఇష్టాన్ని ఎదుర్కొన్నవారే...

గంగూలీ, ఎమ్మెస్ ధోనీలతో పోలిస్తే... టీమిండియా కెప్టెన్సీ వదులుకున్న తర్వాత దాదాపు దశాబ్దానికి పైగా కేవలం ప్లేయర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాడు ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్...

‘టీ20ల్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉండగానే ఓ కొత్త కెప్టెన్, ఓ కొత్త వైస్ కెప్టెన్ రాబోతున్నారు. ఇన్నాళ్లు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, ఇకపై ప్లేయర్‌గా జట్టులో కలిసిపోవాల్సి ఉంటుంది...

కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని విరాట్ కోహ్లీ భావిస్తే, అతను వారికి సలహాలు ఇవ్వొచ్చు. వాళ్లు అవి కరెక్ట్ అని భావిస్తే స్వీకరిస్తారు, లేదంటే లేదు...

సచిన్ టెండూల్కర్ కూడా చాలా మంది కెప్టెన్ల తరుపున ఆడినప్పుడు ఇదే చేశాడు. ప్రతీసారి తన సలహాలు, ఆలోచనలు కెప్టెన్‌తో పంచుకునేవాడు...

వాటిని ఎలా అమలు చేయాలి, ఎలా మెరుగుపరచాలనేది కెప్టెన్‌కి వదిలేసేవాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్‌గా ఆడిన ఆఖరి మ్యాచ్‌లో ఇదే మాటను గొప్పగా చెప్పాడు...

తాను, రోహిత్ జట్టులో ఉన్నంతకాలం యువకులకూ, కెప్టెన్‌గా సహకరిస్తూ ఉంటామని విరాట్ చెప్పాడు. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్ అయిన తర్వాత నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను...

నన్ను వైస్ కెప్టెన్‌గా పెట్టే కంటే ఓ యువకుడిని ఆ పొజిషన్‌లో పెడితే బాగుంటుందని సెలక్టర్లకు చెప్పాను. ధోనీ తప్పుకున్నప్పుడు, అతను కెప్టెన్‌గా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పాను...

అయితే అప్పుడు నా సలహాలు సెలక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు అదే నిజమైంది కూడా. విరాట్ కోహ్లీ ముందుగానే ఈ విషయాన్ని చెప్పాడు...

వైస్ కెప్టెన్‌గా ఓ యువకుడికి అవకాశం ఇవ్వడం జట్టుకి ఎంతో మేలు చేస్తుంది. అతనికి జట్టును ఎలా నడిపించాలో అనుభవం వస్తుంది... ఇదో మంచి పరిణామం...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

అగ్రెసివ్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, క్రీజులో ఓ గన్‌లా కదిలేవాడు. కెప్టెన్సీ వదిలి వేసిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది...

విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత వికెట్ల వెనక నుంచి మొత్తం కథ నడిపించేవాడు ఎమ్మెస్ ధోనీ. సీనియర్ కెప్టెన్ కావడంతో విరాట్ కూడా ధోనీ సలహాలు, సూచనలను తూ.చ, తప్పకుండా పాటించేవాడు...

అయితే విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీ పూర్తిగా డిఫరెంట్. విరాట్‌ది దూకుడైన స్వభావం అయితే రోహిత్ కూల్ అండ్ కామ్. కాబట్టి రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీ ఎపిసోడ్ ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!