ఆయన బ్యాటింగ్ చూశాకే, లెఫ్ట్ హ్యాండర్‌ని అయ్యా! కోహ్లీ, ధోనీ అదే చెప్పారు... వెంకటేశ్ అయ్యర్ కామెంట్స్...

Published : Nov 11, 2021, 04:04 PM ISTUpdated : Nov 11, 2021, 04:10 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఘోర వైఫల్యం తర్వాత ట్రోలింగ్‌ని ఎదుర్కొన్నవారిలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఒకడు. బ్యాటుతో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించినా, మిగిలిన మ్యాచుల్లో హార్ధిక్ పాండ్యా చేసిందేమీ లేదు. బాల్‌తోనూ రాణించలేకపోయాడు...

PREV
111
ఆయన బ్యాటింగ్ చూశాకే, లెఫ్ట్ హ్యాండర్‌ని అయ్యా! కోహ్లీ, ధోనీ అదే చెప్పారు... వెంకటేశ్ అయ్యర్ కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో హార్ధిక్ పాండ్యా పేరు లేకపోవడం, కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పేరు ఉండడం జరిగిపోయాయి...

211

బాల్‌తో పెద్దగా రాణించలేకపోతున్న హార్ధిక్ పాండ్యా ప్లేస్‌కి వెంకటేశ్ అయ్యర్ చెక్ పెడతాడని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు... అయ్యర్ క్లిక్ అయితే, పాండ్యాకి కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు..

311

‘నా చిన్నప్పుడు నేను రైట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసేవాడిని. చిన్నతనం నుంచి నాకు దాదా (సౌరవ్ గంగూలీ) అంటే చాలా ఇష్టం. ఆయనలా ఆడాలని కలలు కంటూ ఉండేవాడిని...

411

సౌరవ్ గంగూలీ బ్యాటింగ్‌ను కాపీ చేయాలనే ఉద్దేశంతోనే లెఫ్ట్ హ్యాండర్‌గా మారిపోయాను. ఇప్పుడు నా బ్యాటింగ్‌ని సౌరవ్ గంగూలీతో పోలుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది...

511

ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీలతో కలిసి మాట్లాడాను. వాళ్లు నా ఆటను మెచ్చుకున్నారు. ఇలాగే కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు...

611

ఐపీఎల్ ఫైనల్ సమయంలో దాదాని కలిశాను. ఆయనతో కలిసి మాట్లాడడం చాలా సంతోషాన్ని కలిగించింది. అది చాలా నార్మల్ సంభాషణే.. ఆయన నాకు పెద్దగా చెప్పిందేమీ లేదు...

711

బాగా ఆడుతున్నావ్, ఇంకొంచెం కష్టపడు, మంచి ఫ్యూచర్ ఉంటుందని సలహా ఇచ్చారు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు..’ అంటూ చెప్పుకొచ్చాడు వెంకటేశ్ అయ్యర్..

811

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో నితీశ్ రాణా స్థానంలో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్...

911

10 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 370 పరుగులు చేసిన అయ్యర్, కేకేఆర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు...

1011

వెంకటేశ్ అయ్యర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేకేఆర్ పర్ఫామెన్స్ పూర్తిగా మారిపోయింది. ఫస్టాఫ్‌లో ఏడు మ్యాచులాడి రెండే రెండు విజాయలు అందుకున్న కేకేఆర్, సెకండాఫ్‌లో ఐదు విజయాలతో ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చింది...

1111

మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని, రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన కేకేఆర్, ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది...

Read more Photos on
click me!

Recommended Stories