T20 worldcup 2021: మెంటర్ చేసేదేమీ లేదు, చేయాల్సిందంతా ప్లేయర్లే... సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published Oct 23, 2021, 6:09 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది టీమిండియా. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టుకి మెంటర్‌గా నియామించడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి...

భారత జట్టు ఆడిన రెండు వార్మప్ మ్యాచుల సమయంలోనూ మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్లేయర్ల కంటే ఎక్కువగా హైలెట్ కావడం... కామెంటేటర్లు కూడా మెంటర్ మాహీ గురించే ఎక్కువగా మాట్లాడుతుండడం క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది...

తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఈ విషయంపై స్పందించాడు.. ‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగాలని అనుకుంటే, అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు...

ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది పూర్తిగా అతని నిర్ణయమే అయి ఉటుంది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక కోహ్లీ ఎలా ఆడతాడో చూడాలనుకుంటున్నా...

విరాట్ కోహ్లీ, ఇంతకుముందులా ఫ్రీగా రెచ్చిపోతే మాత్రం ప్రపంచంలో ఉన్న ఏ బెస్ట్ బౌలర్ కూడా అతన్ని ఆపలేరు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చాలామంది సత్తా ఉన్న ప్లేయర్లను బాగా ఎంకరేజ్ చేశాడు...

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా తయారైంది. మెంటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ నియామకం, భారత జట్టుకి తప్పకుండా కలిసి రావచ్చు...

ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్‌ను తీసుకురావడంతో ధోనీని మించినవాళ్లు లేరు. అయితే నిజం చెప్పాలంటే మెంటర్ చేసేదేం ఉండదు...

మ్యాచ్‌కి ముందు సలహాలు చెప్పడానికి మాత్రమే మెంటర్లు ఉంటారు. మ్యాచ్ సమయంలో క్రీజులో ఆడాల్సింది, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సింది ప్లేయర్లే...

మన ప్లేయర్లు కీలక సమయంలో ఎలా ఆడతారనేదానిపైనే ఫలితం ఉంటుంది. అంతే తప్ప మెంటర్‌గా ఎవ్వరున్నా, మ్యాజిక్‌లు చేయలేరు...

సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ జీనియస్ మెంటర్‌గా ఉన్నా, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవలేకపోయారు... టీమ్ సక్సెస్‌లో మెంటర్ పాత్ర చాలా పరిమితం’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత ఐదు సీజన్లలో టైటిల్ గెలవలేకపోయాడనే విషయం కూడా గుర్తుకు పెట్టుకోవాలని అంటున్నాడు గవాస్కర్...  

click me!