వచ్చే ఏడాది వీళ్లే వరల్డ్‌కప్ గెలుస్తారు... బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కామెంట్స్...

First Published Nov 15, 2021, 5:33 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో క్రికెట్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచిన టీమ్స్‌ వెస్టిండీస్, టీమిండియా. టైటిల్ ఫెవరెట్స్‌గా టోర్నీని ఆరంభించిన ఈ రెండు జట్లూ, గ్రూప్ స్టేజ్‌కే పరిమితమయ్యాయి. అయితే ఈ పరాజయాల నుంచి టీమిండియా వేగంగా కోలుకుంటుందని కామెంట్ చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

టీ20ల్లో విరాట్ కోహ్లీ వరుసగా 10 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడంతో పాటు జట్టులోని ప్రధాన ప్లేయర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో ఈసారి టీమిండియా టైటిల్ గెలవడం ఖాయమనుకున్నారంతా...

అయితే మొదటి రెండు మ్యాచుల్లో దాయాది పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...

‘అవును, ఈసారి టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. విరాట్ కోహ్లీకి టీ20 కెప్టెన్‌గా, రవిశాస్త్రికి హెడ్‌కోచ్‌గా ఆఖరి మెగా లీగ్ కావడంతో భారత జట్టు ఎలాగైనా టైటిల్ కొడుతుందని భావించారంతా...

అయితే నాకు ఓ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందుతో పోలిస్తే, ఇప్పుడు ఓటమిని స్వీకరించే అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. ఆటలో గెలుపు, ఓటములు సహజం అని ఫ్యాన్స్ గుర్తించడం మొదలెట్టారు...

భారత జట్టు ప్రదర్శనతో అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు, అయితే ఆ కోపాన్ని మాత్రం అతిగా చూపించలేదు. ఇది అందరూ చాలా సంతోషించాల్సిన విషయం...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలు కూడా సాధారణ మనుషులే అని వాస్తవాన్ని అభిమానులు గ్రహించారు. తమది కాని రోజున ఏ ప్లేయర్ కూడా ఏమీ చేయలేదు...

అయితే ఈ విజయం నుంచి టీమిండియా వేగంగా కోలుకుంటుంది. వచ్చే ఏడాది, ఇదే జట్టు ట్రోఫీ అందుకుంటుంది. ఆ నమ్మకం నాకు ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

షెడ్యూల్ ప్రకారం గత ఏడాది ఆస్ట్రేలియా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీ, వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాతి ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది...

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టును నడిపించిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వచ్చే ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచకప్ ఆడనుంది టీమిండియా...

ఐపీఎల్‌లో 9 సీజన్లలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, ఈసారి టీమిండియాకి టీ20 వరల్డ్‌కప్ అందిస్తాడని ఆశిస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్...

click me!