ఏంటీ ఫీల్డింగ్! ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారా... పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...

Published : Nov 11, 2021, 09:49 PM ISTUpdated : Nov 11, 2021, 10:40 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ అదిరిపోయే ఆటతీరుతో అదరగొడుతోంది. తమకు స్వంత గ్రౌండ్స్‌గా మారిపోయిన యూఏఈ పిచ్‌లపై గ్రూప్ స్టేజ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకున్న ఏకైక టీమ్‌గా నిలిచిన పాకిస్తాన్‌పై రెండో సెమీస్ సమయంలో ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

PREV
115
ఏంటీ ఫీల్డింగ్! ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారా... పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న టీమిండియా  క్రికెట్ ఫ్యాన్స్...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి మరోసారి పాకిస్తాన్‌కి శుభారంభం అందించారు. 

215

తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఇద్దరూ 400+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం..

315

34 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

415

ఇన్నింగ్స్ మొదటి బంతికే రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్‌తో పాటు ఆసీస్ ప్లేయర్లు క్యాచులు వదిలేయడంతో బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు అవకాశాలు వచ్చినట్టైంది. 

515

ఆసిఫ్ ఆలీ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి, స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ఫకార్ జమాన్ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ జారవిడిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి షోయబ్ మాలిక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు మిచెల్ స్టార్క్. 

615

బ్యాటింగ్ ఎలా ఉన్నా ఫీల్డింగ్‌లో ఆస్ట్రేలియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆసీస్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి వరల్డ్ క్లాస్ ఫీల్డర్లు ఉన్నాయి..

715

అలాంటి జట్టు, పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా ఐదు క్యాచులు జారవిడచడం అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ చేతుల్లోకి వచ్చిన క్యాచులు నేలపాలు కావడంతో ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి...

815

పాకిస్తాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడానికి ఆఫ్ఘాన్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా కారణం. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి బ్యాటింగ్ చేశారు భారత బ్యాట్స్‌మెన్...

915

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మొదటి వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం జోడించడం, ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించడంతో 210 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా...

1015

ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ ఆఫ్ఘాన్‌లో చేసిన చిన్నచిన్న తప్పులను పెద్దవిగా చేసిన పాక్ క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. బీసీసీఐ భారీ మొత్తం చెల్లించి, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఫిక్స్ చేసిందని ఆరోపించారు...

1115

భారత్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఫీల్డర్ తన మిస్ ఫీల్డ్‌తో ఒకే ఒక్క బౌండరీ అప్పగిస్తే... పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్లు ఏకంగా ఐదు క్యాచులను జారవిడిచారు...

1215

ఎంతో క్రికెట్ అనుభవం ఉన్న మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ వంటి ఆసీస్ సీనియర్ బౌలర్లు, గుడ్ లెంగ్త్ బంతులు వేయడంతో ఫకార్ జమాన్ సిక్సర్ల మోత మోగించడంతో ఇదే పక్కా ఫిక్సింగ్ అంటూ పాక్‌కి కౌంటర్ ఇస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్...

1315

ఆఫ్ఘాన్, టీమిండియా మ్యాచ్ సమయంలో ‘ఫిక్స్‌డ్’, ‘వెల్ పెయిడ్’ హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లో కనిపిస్తే, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ను పెద్దగా జనాలు పట్టించుకోకపోవడం విశేషం...

1415

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే టీవీ రిప్లైలో డేవిడ్ వార్నర్ బ్యాటుకి బంతి తగలనట్టు స్పష్టంగా కనిపించింది.

1515

బ్యాటుకి బంతికీ మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తున్నప్పుడు, బ్యాటుకి బంతి తగలలేదని వార్నర్‌కి తెలిసినప్పడు రివ్యూ ఎందుకు తీసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 

click me!

Recommended Stories