పాకిస్తాన్‌ విజయాల వెనక ఆస్ట్రేలియా ఓపెనర్... అప్పుడు స్నేహితులు, ఇప్పుడు ప్రత్యర్థులుగా...

First Published Nov 11, 2021, 7:30 PM IST

T20 Worldcup 2021 Semi-finals 2 PAK vs AUS: రాజకీయాల్లోనే కాదు, క్రికెట్‌లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఒకే టీమ్‌కి ఆడిన ప్లేయర్లు కూడా, ఫార్మాట్‌ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రత్యర్థులుగా తలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2021 రెండో సెమీ ఫైనల్‌లో తలబడుతున్న పాక్, ఆసీస్ కోచ్‌ల పరిస్థితి ఇదే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ జట్టు అనేక సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి జట్టును ఎంపిక చేసిన వెంటనే పాక్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామాలు సమర్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

దీంతో పాటు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు జరగాల్సిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లు అర్ధాంతరంగా రద్దు అయ్యాయి. పాకిస్తాన్‌లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, క్వారంటైన్ గడిపి, వన్డే సిరీస్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ‘సెక్యూరిటీ రీజన్స్’తో టూర్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది న్యూజిలాండ్. 


పాక్‌ పర్యటించిన జట్లే, అక్కడ పరిస్థితులు బాగోలేవని భయపడి, వెనక్కి వచ్చేస్తే తాము ఎలా పర్యటించగలమని ఇంగ్లాండ్ టీమ్‌ కూడా పాకిస్తాన్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు రావడంతో పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా కలుగు చేసుకుని పాక్ టీమ్‌లో మార్పులు చేశాడు. ఈ దశలో పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా, పాక్ కొత్త హెడ్‌కోచ్‌గా ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ మాథ్యూ హెడేన్‌ని నియమిస్తున్నట్టు ప్రకటించింది పీసీబీ...

మాథ్యూ హేడెన్ ఎంట్రీ నుంచి పాక్ టీమ్ ఆటతీరు, గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్ టీమ్, 29 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుపై విజయాన్ని అందుకుంది. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో పాక్‌పై వరుసగా అందుకున్న 12 విజయాలకు తెర పడింది...

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ పేసర్లను ఎదుర్కొన్న పాక్ ఓపెనర్లు... భారత ఫీల్డర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారంటే... ఆ ఇన్నింగ్స్‌కి కారణం మాథ్యూ హేడెన్...

ఆస్ట్రేలియా కూడా అండర్‌డాగ్స్‌గానే టోర్నీని ఆరంభించింది. ఇంగ్లాండ్‌తో ఆసీస్ ఆటతీరు చూసిన వారు, ఈ టీమ్ ప్లేఆఫ్స్‌ చేరుకోగలదని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే గ్రూప్ స్టేజ్‌లో నాలుగు విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కి దూసుకొచ్చింది...

సెమీ ఫైనల్ 2లో ఆడుతున్న పాకిస్తాస్, ఆస్ట్రేలియా జట్ల హెడ్‌కోచ్‌లు మాథ్యూ హేడెన్, జస్టిన్ లాంగర్... ఇద్దరూ ఒకప్పుడు ఓపెనర్లుగా ఆసీస్‌కి అనేక విజయాలను అందించారు. ఈ ఇద్దరూ ఇప్పటికీ టెస్టుల్లో ఆల్‌ టైం బెస్ట్ పార్టనర్‌షిప్ క్రియేట్ చేసిన ఓపెనర్లుగా ఉన్నారు...

‘ఇదో కొత్త అనుభవం. ఆస్ట్రేలియాకి రెండు దశాబ్దాలకి పైగా ఆడాను. ఆస్ట్రేలియా జట్టు ఎలా ఆలోచిస్తుంది, ఆ ప్లేయర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందనే విషయాలపై నాకు మంచి అవగాహన ఉంది...

పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌తో సభ్యుడిగా అయినందుకు కూడా గర్వపడుతున్నా... ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ హెడ్ కోచ్ మాథ్యూ హేడెన్...

‘క్రికెట్ ఎప్పుడూ ఎన్నో అద్భుతమైన అనుభవాలను మిగుల్చుతుంది. అలాగే గొప్ప స్నేహితులని కూడా... మాథ్యూ హేడెన్ పాకిస్తాన్ జెర్సీని వేసుకోబోతున్నాడు.. నేను ఆసీస్ జెర్సీని వేసుకుంటా... అయినా మేమెప్పుడూ స్నేహితులమే...  ఎందుకంటే క్రికెట్ పరిభాషలో మాట్లాడుకుంటే మనుషులుగా ఆలోచించలేం. ఇది క్రికెట్‌పై ప్రేమ మాత్రమే...’ అంటూ కామెంట్ చేశాడు జస్టిన్ లాంగర్...

click me!