టీ20 వరల్డ్‌కప్ కాబట్టి బతికిపోయారు, అదే ఐపీఎల్ అయ్యుంటేనా ఇచ్చిపడేసేవాళ్లు... టీమిండియా పర్ఫామెన్స్‌పై..

First Published Nov 1, 2021, 3:47 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పర్ఫామెన్స్, ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది. హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు నుంచి ఇలాంటి పర్ఫామెన్స్, అస్సలు ఊహించలేకపోయారు అభిమానులు...

టీ20 వరల్డ్‌కప్ 2021 వార్మప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది టీమిండియా. మరీ విచిత్రంగా రెండు మ్యాచుల్లో టాస్ కూడా టీమిండియాకి కలిసి వచ్చింది...

అయితే వార్మప్‌ మ్యాచుల్లో ఉన్న జోష్, టీ20 వరల్డ్‌కప్ మొదలైన తర్వాత మాయమైపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది... దీంతో టీమిండియా క్రికెటర్ల పర్ఫామెన్స్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్లలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు కెఎల్ రాహుల్. గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, ఈ సీజన్‌లో 13 మ్యాచులాడి 626 పరుగులు చేశాడు...

కెఎల్ రాహుల్‌ బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో అతను, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా మారతాడని, టీమిండియాకి కీ ప్లేయర్ అతనేనని అంచనా వేశారు క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు...

కానీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో 3 పరుగులు చేసిన కెఎల్, న్యూజిలాండ్‌తో ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న కెఎల్ రాహుల్, టీమిండియా తరుపున ఆడిన గత 7 టీ20 మ్యాచుల్లో మూడుసార్లు డకౌట్ కాగా, మిగిలిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 1, 14, 3, 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా భీకరంగా చెలరేగిపోయాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో అయితే ‘పర్పుల్ క్యాప్’ విన్నర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లతో 37 పరుగులు రాబట్టాడు జడ్డూ...

అదే కాదు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన చాలా మ్యాచుల్లో రవీంద్ర జడేజా బ్యాటుతో లేదా బంతితో... ఆ రెండు కాకుండా ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపిస్తూ క్రీజులో ఓ రేసుగుర్రంలా కనిపించాడు...

అయితే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తరుపున ఆడాల్సి వచ్చేసరికి ఆ రేసు గుర్రానికి జ్వరం వచ్చినట్టుగా మారింది పరిస్థితి... ఫీల్డ్‌లో అతని యాటిట్యూడ్‌లో చాలా తేడా కనిపించింది..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు రవీంద్ర జడేజా. అయితే అతని రేంజ్‌ మెరుపులు అయితే కనిపించలేదు...

ఇషాన్ కిషన్... ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఆఖరి రెండు మ్యాచుల్లో రెండు అద్భుత హాఫ్ సెంచరీలు చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు ఇషాన్ కిషన్...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అయితే 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది విశ్వరూపమే చూపించాడు. కేవలం ఈ ఇన్నింగ్స్ కారణంగానే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించింది టీమిండియా...

అయితే ఈ చిన్నోడి అనుభవలేమి, కీలక మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. వార్మప్ మ్యాచుల్లో ఫీల్డర్‌లకు అవకాశం లేకుండా బౌండరీలు బాదిన ఇషాన్ కిషన్, టీమిండియా తరుపున వరల్డ్‌కప్ ఆడుతున్న అనే ప్రెషర్‌ను తట్టుకోలేకపోయాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో మనోళ్ల పర్ఫామెన్స్‌ని చూసిన ఫ్యాన్స్ అందరి నోట ఒకటే మాట... ‘ఇది టీ20 వరల్డ్‌కప్ కాబట్టి బతికిపోయారు, లేదంటే మావోళ్లు పర్ఫామెన్స్ ఇచ్చి పడేసేవాళ్లు...’ అని...

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అనంతరం ‘బ్యాన్ ఐపీఎల్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది... బీసీసీఐపై, ఐపీఎల్‌పై, భారత క్రికెటర్లపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

click me!