ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీ చాలా కాస్ట్‌లీ గురూ... ఒక్క ప్లేయర్‌కి రూ.16 కోట్లు, నలుగురు కావాలంటే...

First Published Nov 1, 2021, 3:16 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం జరగనుంది. పాత ఫ్రాంఛైజీలకు మహా అయితే నలుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. తాజాగా రిటైన్షన్ పాలసీకి సంబంధించిన నియమాలు ప్రచారంలోకి వచ్చాయి...

నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తే, ఆ జట్టు రూ.42 కోట్లు వదులుకోవడానికి సిద్ధపడాల్సిందే.  ప్లేయర్ 1కి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.12 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

నాలుగో ప్లేయర్‌కి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్‌లను అట్టిపెట్టుకోవాలని అనుకుంటే....

రోహిత్ శర్మకు రూ.16 కోట్లు, జస్ప్రిత్ బుమ్రాకి రూ.12 కోట్లు, కిరన్ పోలార్డ్‌కి రూ.8 కోట్లు, ఇషాన్ కిషన్‌కి రూ.6 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది...

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పటికే ఏటా రూ.15 కోట్లు చెల్లిస్తోంది ముంబై ఇండియన్స్. వచ్చే ఏడాది నుంచి మరో కోటి రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో రూ.90 కోట్లు ఉంటాయి. వీటిలో నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటంది. అంటే మిగిలిన రూ.48 కోట్లతో మిగిలిన జట్టును నిర్మించాల్సి వస్తుంది...

ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని ఫ్రాంఛైజీలు భావిస్తే రిటైన్షన్ ధరలు తగ్గుతాయి. ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.7 కోట్ల చొప్పున రూ.33 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది...

పాత ఫ్రాంఛైజీలు ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని అనుకుంటే, ఈ రేటు మరింత తగ్గుతుంది. మొదటి ప్లేయర్‌కి రూ.14 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.10 కోట్లు... మొత్తంగా రూ.24 కోట్లు పర్సులో నుంచి తగ్గించబడతాయి...

ఒకే ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవాలంటే రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌‌ని అట్టిపెట్టుకోవాలన్నా కూడా ఒక్కో ప్లేయర్‌కి రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రాంఛైజీలు...

అన్ క్యాప్డ్ ప్లేయర్లు అయినా, క్యాప్‌డ్ ప్లేయర్ అయినా సరే ముగ్గురు స్వదేశీ ప్లేయర్లకు మించి అట్టిపెట్టుకునేందుకు పాత ఫ్రాంఛైజీలకు అవకాశం ఉండదు. ఇద్దరు విదేశీ ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది...

కొత్తగా వచ్చిన రెండు జట్లు, ఐపీఎల్ వేలానికి ముందు అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లను ‘ఫ్రీ టికెట్’ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది...

ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాలని కొత్త ఫ్రాంఛైజీలు భావిస్తే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

ఇద్దరు ప్లేయర్లను కొనుగోలు చేస్తే మొదటి ప్లేయర్‌కి రూ.14 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకే ప్లేయర్‌ను కొనుగోలు చేస్తే రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

కొత్త ఫ్రాంఛైజీలు కూడా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరికి కూడా రూ.4 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి ఫ్రాంఛైజీలు..

కొత్తగా వచ్చిన రెండు జట్లకి అత్యధికంగా ఇద్దరు స్వదేశీ ప్లేయర్లను, ఓ విదేశీ ప్లేయర్, ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను మాత్రమే మెగా వేలానికి ముందు కొనుగోలు చేయడానికి వీలుంటుంది...

click me!