టీ20 వరల్డ్‌కప్ 2021 వేదికలు ఇవే... భారత్‌లో పెట్టలేకపోవడం బాధాకరం...

First Published Jun 29, 2021, 4:03 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 వేదికను ఖారారుచేస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. చివరిసారిగా 2016లో చివరిసారిగా జరిగిన టీ20 వరల్డ్‌కప్, మళ్లీ ఐదేళ్లకు తిరిగి ప్రారంభం కానుంది...

తొలుత భారత్‌ వేదికగా టీ20 వరల్డ్‌కప్ నిర్వహించాలని ప్రయత్నాలు చేసినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వీలుకాలేదు. దీంతో యూఏఈ, ఓమన్ వేదికలుగా 2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరగనుంది.
undefined
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జావేద్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియంతో పాటు ఓమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో టీ20 వరల్డ్‌కప్ పోటీలు జరగనున్నాయి...
undefined

Latest Videos


అక్టోబర్ 17న ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో తొలుత 8 జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించేందుకు పోటీపడనున్నాయి....
undefined
బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఓమన్, పపువా న్యూ జెనీవా జట్లు.. సూపర్ 12 రౌండ్‌లో పోటీపడతాయి. వీటిలో టేబుల్ టాపర్‌గా నిలిచిన నాలుగు జట్లు, మిగిలిన 8 టీమ్‌లతో కలిసి సూపర్ 12 రౌండ్ ఆడతాయి...
undefined
2009, 2012 టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన శ్రీలంక జట్టు, 2014లో టైటిల్ గెలిచింది. అయితే ప్రస్తుతం పూర్ పర్ఫామెన్స్ కారణంగా వరల్డ్‌కప్‌కి అర్హత సాధించేందుకు పసికూన జట్లతో తలబడబోతోంది శ్రీలంక..
undefined
‘ఎలాంటి అవాంతరాలు లేకుండా, క్రికెటర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌ను నిర్వహించడమే మా మొదటి ప్రాధాన్యం. భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించలేకపోవడం బాధాకరం...’ అంటూ తెలిపాడు ఐసీసీ సీఈవో జీవాఫ్ ఆల్డీస్...
undefined
కరోనా కారణంగా యూఏఈకి వేదిక మారినా, టీ20 వరల్డ్‌కప్ 2021 నిర్వహణ బాధ్యతను బీసీసీఐ స్వయంగా పర్యవేక్షించనుంది.
undefined
అక్టోబర్ 17న మొదలయ్యే ఈ టోర్నీ, నవంబర్ 14న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించనుంది బీసీసీఐ..
undefined
click me!