కొన్నేళ్ల క్రితం వరకూ కుమార సంగర్కర, జయవర్థనే, ముత్తయ్య మురళీధరన్, మలింగ, జయసూర్య, దిల్షాన్ వంటి స్టార్ పర్ఫామర్లతో శ్రీలంక జట్టు అద్భుతాలు చేసింది...
1996లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలం జట్టు, 2007 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కి అర్హత సాధించింది. 2009 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తో పాటు 2012లోనూ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆడింది.
అయితే ఈ లెజెండ్స్ రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రదర్శన రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది. ఇంగ్లాండ్ టూర్‌లో లంక బ్యాట్స్‌మెన్, గల్లీ క్రికెటర్ల కంటే ఘోరంగా బ్యాటింగ్ చేశారు...
టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన శ్రీలంక జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఓడిన దాని కంటే శ్రీలంక జట్టు ఆడిన విధానంపైనే లంక ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు...
ఇప్పటికే శ్రీలంక దారుణ పర్ఫామెన్స్ కారణంగా క్రికెటర్లను సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యే క్యాంపెయిన్‌ను మొదలెట్టిన లంక క్రికెట్ ఫ్యాన్స్, ఇప్పుడు టీమిండియాను రిక్వెస్ట్ చేస్తున్నారు.
మూడు టీ20లు, మూడు వన్డేల కోసం ఇప్పటికే లంకకు చేరుకున్న భారత జట్టు, అక్కడ క్వారంటైన్‌లో గడుపుతోంది. ఈ టూర్‌కి రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా, శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్న విషయం తెలిసిందే.
శ్రీలంకకు బయలుదేరిన భారత జట్టు ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్న లంకేయులు... ‘మీరు ఇక్కడికి రావడం ఎందుకు దండగ, మేమే ట్రోఫీని మీకు పంపిస్తాం...’ అంటూ నిరుత్సాహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల క్రితం ఉన్న జట్టుతో పోలిస్తే భారత జట్టు చాలా బెటర్‌గా తయారు అయ్యిందని... టీమిండియాలో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యాల రూపంలో స్టార్లకు కొదవ లేదని, శ్రీలంక జట్టు వీరి చేతుల్లో చిత్తుగా ఓడుతుందని అంచనా వేస్తున్నారు...
లంక జట్టు ప్రదర్శనే ఘోరంగా ఉందంటే యూకేలో ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్‌వాలా, ధనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనలను అతిక్రమించారు.
వీరిని వెంటనే స్వదేశానికి పంపించిన శ్రీలంక క్రికెట్ బోర్డు, వారిని మూడు నెలల నుంచి ఏడాది పాటు ఏ రకమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించబోతున్నట్టు సమాచారం.