టీమిండియా ఆటను తట్టుకోలేకపోతున్న పాక్... ఆఫ్ఘాన్‌తో కలిసి ఫిక్సింగ్ చేశారంటూ...

First Published Nov 3, 2021, 10:59 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసి 210 పరుగుల భారీ స్కోరు చేసింది...

ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం, ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా...

ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు. దీంతో భారత జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ, ‘ఫిక్సింగ్’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు పాకిస్తాన్‌ జనాలు...

మొదటి రెండు మ్యాచుల్లో టాస్ గెలిచిన తర్వాత మరో ఆలోచన లేకుండా మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ... పాక్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

బ్యాటింగ్‌కి అనుకూలించని పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్, ఆఫ్ఘాన్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు క్రికెట్ ఫ్యాన్స్... అయితే స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 191 పరుగుల భారీ స్కోరు చేయడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు నబీ...

టాస్ గెలిచిన తర్వాత నబీ, విరాట్ కోహ్లీతో మేం బౌలింగ్ చేస్తాం అంటూ మెల్లిగా చెప్పాడు. అది మైక్ కెమెరాల్లో వినిపించింది. అయితే వీడియోలో అది ఎవరు చెబుతున్నారో స్పష్టంగా కనిపించలేదు...

దీంతో విరాట్ కోహ్లీయే మహ్మద్ నబీతో టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకోమని చెబుతున్నాడని, ఫిక్సింగ్‌కి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలని ట్వీట్లు చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్...

ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్‌లో చేసిన కొన్ని పొరపాట్లు కూడా పాకిస్తాన్‌ ఫిక్సింగ్ ఆరోపణలకు కారణమయ్యాయి. బౌండరీ లైన్ దగ్గర డ్రైవ్ చేస్తూ ఆపిన ఫీల్డర్, బంతిని ఆపలేకపోవడాన్ని ఫిక్సింగ్ కాక ఇంకేం అనుకోవాలంటూ ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్‌ను జారవిడచడాన్ని కూడా బీసీసీఐ, తన దగ్గరున్న డబ్బులతో ఆఫ్ఘాన్‌ని ఓడిపోవాలని సూచించి ఉంటుందని, ఇదే పక్కా ఫిక్సింగేనంటూ పోస్టులు చేస్తున్నారు...

టీమిండియాతో జరిగే మ్యాచ్ ఫిక్స్ అవ్వడం వల్లే, టీ20 వరల్డ్‌కప్ టోర్నీ మధ్యలోనే ఆస్గర్ ఆఫ్ఘాన్ రిటైర్మెంట్ ప్రకటించాడని పిచ్చి రాతలు రాస్తున్నారు...

అయితే టీమిండియా ఫ్యాన్స్, పాక్ జనాలకు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. భారత జట్టు అసలైన ఆటతీరును చూసి తట్టుకోలేక, పాకిస్తానీలు కడుపు మండిపోతోందని అందుకే ఇలా ఫిక్సింగ్ అంటూ వాగుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు...

వార్మప్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్‌పై భారత జట్టు ఆడిన విధానం చూసిన తర్వాత కూడా ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం అవివేకమని, అది కూడా ఫిక్సర్లతో నిండిన పాకిస్తానీ ఫ్యాన్స్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ తిప్పి కొడుతున్నారు...

గత 10 ఏళ్ల కాలంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులతో బ్యాన్‌ పడిన క్రికెటర్లలో ఎక్కువమంది పాకిస్తాన్‌కి చెందినవారే ఉంటారని, అది మరిచి భారత జట్టు సూపర్ పర్ఫామెన్స్‌ను తట్టుకోలేక ఫిక్సింగ్ చేస్తున్నారంటూ ఆరోపించడం... పొగ తాగేవాడు, నో స్మోకింగ్ బోర్డు పెట్టడంలా ఉందంటూ మీమీలు పోస్టు చేస్తున్నారు...

click me!