ఇంకేముందిలే, ఇక బ్యాగులు సర్దుకోవడమే... ఐదు నెలల తర్వాత స్వదేశానికి రానున్న టీమిండియా...

First Published Nov 7, 2021, 6:32 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ఫ్యాన్స్ ఆశించిన అద్భుతం జరగలేదు. పసికూన ఆఫ్ఘాన్, పటిష్ట న్యూజిలాండ్‌ను ఓడించాలని, ఓడిస్తుందని ఆశలు పెట్టుకున్న భారత అభిమానుల ఆశ నెరవేరలేదు. దీంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు, నమీబియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది.

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో తమ ప్రతాపం చూపించింది... నమీబియాతో ఆఖరి మ్యాచ్ ఆడి, స్వదేశానికి తిరిగి రానుంది...

అప్పుడు మే నెలలో ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి కరోనా కారణంగా అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత స్వదేశం నుంచి వెళ్లిన భారత క్రికెటర్లు, ఐదు నెలల తర్వాత తిరిగి ఇంటికి రానున్నారు...

జూన్ నెలలో న్యూజిలాండ్‌తో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత జట్టు, ఇంగ్లాండ్‌లో 20 రోజుల హాలీడేస్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో కలిసి టెస్టు సిరీస్ ఆడింది...

నాలుగు టెస్టుల్లో రెండింట్లో గెలిచిన టీమిండియా, ఓ టెస్టులో ఓడింది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. రవిశాస్త్రి అండ్ కోచింగ్ స్టాఫ్ కరోనా బారిన పడడంతో ఐదో టెస్టును వాయిదా వేసుకుని, యూఏఈ చేరుకుంది టీమిండియా...

యూఏఈలో ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆడిన భారత జట్టు క్రికెటర్లు, ఆ తర్వాత నేరుగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడి స్వదేశానికి చేరుకోబోతున్నారు...  

స్వదేశం నుంచి బయలుదేరి వెళ్లిన ఈ ఐదు నెలల కాలంలో భారత జట్టు రెండు టెస్టుల్లో గెలిచి, రెండు టెస్టుల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో ఓ టెస్టు) ఓడింది. ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో రెండింట్లో ఓడి, రెండు విజయాలు అందుకుంది...

గత ఐపీఎల్ 2020 టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన భారత జట్టు ఆడిలైడ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, దారుణమైన పరాభవాన్ని చవిచూసింది. ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఆధిక్యం నిలిచింది. వాయిదా పడిన ఐదో టెస్టు, వచ్చే ఏడాది జరగనుంది.

అయితే ఐపీఎల్ 2021 సీజన్ మాత్రం టీమిండియాకి పెద్దగా కలిసి రాలేదు. ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఆడిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా... ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి, మరో చెత్త రికార్డు నమోదు చేసింది...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ముగిసిన తర్వాత వార్మప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు భారత ఆటగాళ్లు. అయితే టోర్నీ మొదలయ్యాక తేలిపోయారు. 

ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై తొలిసారి పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, న్యూజిలాండ్‌పై గత 18 ఏళ్లుగా వస్తున్న ఐసీసీ టోర్నీల్లో పరాజయ ఆనవాయితీని కొనసాగించింది...

click me!