వాళ్లతో పోలిస్తే, ఇది చాలా తక్కువే! భారత జెండా ఎగరవేసినందుకు పాకిస్తానీ వీరాభిమానికి 10 ఏళ్ల జైలు...

First Published Oct 28, 2021, 3:32 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టు, పాక్ చేతుల్లో ఓడడం ఇదే తొలిసారి. ఏ ఆటలో అయినా గెలుపు ఓటములు సహజం...

టీమిండియాపై పాక్ విజయాన్ని అందుకున్న తర్వాత చాలా చోట్ల భారతీయులే సంబరాలు చేసుకోవడం చాలా హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

వాళ్లు భారత సైనికుల ప్రాణాలు తీస్తుంటే, ఈ సమయంలో మ్యాచ్ అవసరమా? అని భారీ డైలాగులు చెప్పినవాళ్లు కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్‌పై పాక్ విజయాన్ని టపాకాయలు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు..

చదువూ, సంధ్యలు లేనివాళ్లు చెప్పుడు మాటలు విని మతం మీద మోజుతో ఇలా చేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు, షేరీ ఈ కశ్మరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS)విద్యార్థులు కూడా ఇలా పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నవారిలో ఉండడం విశేషం. 

భారత్‌పై పాక్ విజయం సాధించిన తర్వాత ‘పాకిస్తాన్ జిందాబాద్, ఇస్లాం జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ, విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...

ప్రభుత్వం అందించే నిధులతో చదువుకుంటున్న గవర్నమెంట్ విద్యార్థులు ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విద్యార్థులపై UAPA (చట్టవిరుద్ధమైన చర్యల నిరోధక చట్టం) కింద కేసులు నమోదుచేశారు పోలీసులు. వీరిని వైద్య పట్టాలు ఇవ్వకూడదని, చట్టబద్ధమైన వైద్యులుగా గుర్తించకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

‘ఏ దేశంవారైనా, మరో దేశం విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తప్పా? ఎక్కడ పుట్టినా బ్రెజిల్ గెలిచిందని మనం సెలబ్రేట్ చేసుకోవడం లేదా? ఇది అంతే...’ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ విద్యార్థుల్లో కొందరు...

వీరి కామెంట్లతో ఐదేళ్ల క్రితం అరెస్టైన పాకిస్తాన్‌కి చెందిన విరాట్ కోహ్లీ వీరాభిమాని స్టోరీ మళ్లీ వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోన ఒకారా ఏరియాకి చెందిన ఉమర్ డ్రాజ్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని.

2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఇండియా 188/3 పరుగుల భారీ స్కోరుగా చేయగా, ఆస్ట్రేలియా  151 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్ తర్వాత విరాట్ మీద అభిమానంతో తన ఇంటి మీద భారత జెండాను ఎగురవేశాడు ఉమర్. ట్రైలర్‌గా పనిచేసే ఉమర్‌కి అలా పక్కదేశం జెండాలు ఎగురవేయడం నేరమని కూడా తెలీదని చెప్పాడు. అయినా వినకుండా అతనికి 10 ఏళ్ల కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. ఐదేళ్ల శిక్ష పూర్తిచేసుకున్న ఉమర్, ఇంకా జైలులోనే జీవితం గడుపుతున్నాడు.

భారత దేశం లౌకిక దేశం కాబట్టి పాకిస్తాన్‌కి సపోర్టుగా నినాదాలు చేసినా, వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా పెద్దగా శిక్షలు పడడం లేదని, అదే పాక్‌లో కానీ మరో దేశంలో కానీ అయితే చుట్టుపక్కలవాళ్లే చంపేసి ఉండేవారని కామెంట్లు చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్...

ఇక్కడ పుట్టి, అదీ ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో చదువుకుంటూ శత్రుదేశాన్ని సపోర్ట్ చేయడం తప్పుకాదని వాదించిడం తీవ్రవాదంతో సమానమని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగిలే మాత్రం కనిపించడం లేదు.
 

click me!