T20 Worldcup: పాక్ పేస్ సంచలనంతో షాహీద్ అఫ్రిది కూతురు పెళ్లి.. మామ లాగే అల్లుడూ అదరగొడుతున్నాడుగా..

First Published Oct 28, 2021, 12:56 PM IST

Shaheen Afridi: దాయాదుల మధ్య పోరులో భారత్ ను తొలి దెబ్బ తీసి టీమిండియా పరాజయాన్ని తొలి ఐదు ఓవర్లలోపే ఖరారు చేసిన పాకిస్థాన్ యువ సంచలనం షాహీన్ షా అఫ్రిది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడు చేసుకునేది ఎవరినో తెలుసా..?

చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ ల మధ్య గత ఆదివారం జరిగిన హోరాహోరి పోరులో తొలి రెండు ఓవర్లలోనే టీమిండియా పరాజయానికి బాటలు పడ్డాయి.  పాక్ తరఫున తొలి ఓవర్ వేసిన షాహీన్ షా అఫ్రిది.. రోహిత్ శర్మ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో  కెఎల్ రాహుల్ నూ పెవిలియన్ కు పంపి భారత టాపార్డర్ ను కకావికలం చేశాడు. ఈ ఒక్క ప్రదర్శనతో అతడు ఓవర్ నైట్ స్టారయ్యాడు. వికెట్ తీసిన తర్వాత పాకిస్థాన్ మాజీ  ఆల్ రౌండర్ షాహీద్ అఫ్రిది మాదిరే.. రెండు చేతులు పైకి లేపుతూ విజయసంబరాలు చేసకునే ఈ యువ సంచలనం.. త్వరలోనే అఫ్రిదికి అల్లుడు కూడా కాబోతున్నాడు.  

21 ఏళ్ల యువ బౌలర్ షాహీన్ అఫ్రిది ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్లు తీసిన షాహీన్.. తాజాగా న్యూజిలాండ్‌పై కూడా ఓ వికెట్ తీసుకున్నాడు.

షాహీన్ 3 సంవత్సరాల క్రితం 21 సెప్టెంబర్ 2018న ఆఫ్ఘనిస్తాన్‌పై  అరంగ్రేటం చేశాడు. తక్కువ సమయంలోనే పాకిస్థాన్ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 19 టెస్టులాడిన అఫ్రిది.. 76 వికెట్లు, 28 వన్డేల్లో 53 వికెట్లు, 32 టీ20 అంతర్జాతీయ  మ్యాచ్ లలో 36 వికెట్లు పడగొట్టాడు.

పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ పెద్ద కూతురు అక్సా అఫ్రిదీని షాహీన్ షా అఫ్రిది త్వరలో పెళ్లాడబోతున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఇందుకు సంబంధించిన విషయం వెల్లడైంది. ఇదే విషయమై షాహిద్ ట్వీట్ చేస్తూ, "మా రెండు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించాయి. త్వరలోనే నిశ్చితార్థం జరుపుకుంటాం" అని ట్వీట్ చేశాడు. 

అక్సా, షాహీన్‌లకు ఇంకా నిశ్చితార్థం జరగనప్పటికీ, క్రికెట్ అభిమానులు మాత్రం ఆ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండేండ్లలో వారి పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. 

ఇక ఈ యువ క్రికెటర్ ఆటతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ప్రతిరోజూ అతడికి సంబంధించిన చిత్రాలను ఫేస్బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటాడు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా షాహీన్ అఫ్రిది నిలిచాడు. ఈ విషయంలో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును అతడు బద్దలు కొట్టాడు.

click me!