హిందువుల ముందు నమాజ్, భలే కిక్ ఇచ్చింది... వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు... క్రికెట్‌కి మతం మకిలి...

First Published Oct 26, 2021, 8:07 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌, జెంటిల్మెన్ గేమ్‌గా పిలవబడే క్రికెట్‌కి మతం మకిలి అంటిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ మహ్మద్ షమీ, తన ఆఖరి ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో అతన్ని టార్గెట్ చేసి కొందరు భారతీయులు పిచ్చి కూతలు కూస్తే, ఇప్పుడు పాక్ మాజీ క్రికెటర కూడా ఇదే దారిలో నడిచాడు...

టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఓ మీడియా ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు పాక్ మాజీ క్రికెటర్, మాజీ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్. ఈ సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి...

‘భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ బ్యాటింగ్ కంటే ఎక్కువగా, అతను అంతమంది హిందువుల ముందు నమాజ్ చేయడం నాకెంతో నచ్చింది. భలే కిక్‌ని ఇచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు వకార్ యూనిస్...

ఈ వ్యాఖ్యలపై భారత స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘వకార్ యూనిస్ చేసిన కామెంట్స్ నాకే మాత్రం నచ్చలేదు. హిందువుల ముందు నమాజ్ చేయడం తనకి స్పెషల్ అని చెప్పడని తెలిసి చాలా డిస్సపాయింట్ అయ్యాను.

మనలో చాలామంది క్రికెట్‌లో మతం, కులం, భాష, రంగు లాంటి విషయాలు రావని నిరూపించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నా. అలాంటి సమయాల్లో జాతీయ జట్టుకి ఆడిన ఓ మాజీ క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వింటుంటే బాధేస్తుంది...

పాకిస్తాన్‌లోని నిజమైన క్రికెట్ ప్రేమికులు, వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యల్లో ప్రమాదకరమైన కోణాన్ని ఖండిస్తారని అనుకుంటున్నా. 

క్రికెట్‌ని ఎంతగానే ప్రేమించే క్రీడా ప్రేమికులకు ఆటను ఆటగా మాత్రమే చూడమని, మతం మకిలి అంటించవద్దని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది..

క్రికెటర్లు, గేమ్‌కి అంబాసిడర్లుగా వ్యవహరించాల్సిన వ్యక్తులు మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. మతాలుగా విడిపోయిన జనాల మధ్య, క్రీడా ప్రేమికులుగా క్రికెట్ ప్రపంచంలో కలిసి ఉందాం... ’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు హర్షా భోగ్లే...

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత ఓ పాక్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. 

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత ఓ పాక్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. 

దాయాదులతో మ్యాచ్‌ను భారతీయులు... ‘భారత్ వర్సెస్ పాకిస్తాన్’ మ్యాచ్‌గా చూస్తే పాకిస్తాన్ ప్రజలు మాత్రం ‘హిందువులు వర్సెస్ ముస్లిం’లకు మధ్య మ్యాచ్‌గా చూస్తున్నారని, భారతీయుల్లో కొందరు ముస్లింలు కూడా ఇలా భావించడం వల్లే పాక్ విజయం తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారని అంటున్నారు కొందరు నెటిజన్లు..

click me!