కేక్ పెట్టలేదని, క్యాచ్ డ్రాప్ చేశావా... పాక్ పేసర్ హసన్ ఆలీపై పేలుతున్న జోక్స్...

First Published Nov 12, 2021, 10:38 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఓడింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌కి 5 వికెట్ల తేడాతో పరాజయం ఎదురైంది. 15వ ఓవర్ వరకూ విజయంపై ధీమాగా ఉన్న పాకిస్తాన్, ఆ తర్వాత నాలుగు ఓవర్లలో 62 పరుగులు సమర్పించి, చేజేతులా ఓడినట్టైంది. 

ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్... మాథ్యూ వేడ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర ఉన్న హసన్ ఆలీ ఒడిసిపట్టలేకపోవడం... 

విజయానికి 10 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన దశలో ఓ వైడ్ వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సి వచ్చింది. ఇది పెద్ద కష్టమేమీ కాకపోయినా పాక్ పేసర్లు, ఈ టోర్నీలో అదరగొడుతున్నారు...

యంగ్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ అయితే టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఇండియా, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బందిపెట్టాడు. కాబట్టి ఆస్ట్రేలియా మ్యాచ్ గెలవడం కష్టమే అనుకున్నారంతా...

అయితే ఈ దశలో మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌, హసన్ ఆలీ చేతి వేళ్లను తాకుతూ నేలజారింది. ఈ లోపు వేడ్, స్టోయినిస్ రెండు పరుగులు తీశారు. లక్కీగా వచ్చిన లైఫ్‌ని చక్కగా వాడుకున్న మాథ్యూ వేడ్... ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు...

వికెట్లను వదిలేసి స్వేచ్ఛగా షాట్స్ ఆడిన మాథ్యూ వేడ్, ఆఫ్ కట్టర్, స్కూప్, చీక్ షాట్లతో మూడు సిక్సర్లు కొట్టి... మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో ఈ విధ్వంసానికి ముందు హసన్ ఆలీ వదిలేసిన క్యాచ్... టర్నింగ్ పాయింట్‌గా మారింది...

హసన్ ఆలీ క్యాచ్ డ్రాప్ చేయడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం పాక్ క్రికెటర్ హారీస్ రౌఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి...

స్కాట్లాండ్‌తో మ్యాచ్ అనంతరం జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో హరీస్ రౌఫ్, కేక్ ముక్కను హసన్ ఆలీ నోట్లో పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న షాహీన్ ఆఫ్రిదీ కలగజేసుకుని కేకు పూయడంతో... హసన్ ఆలీ నోట్లోకి కేక్ వెళ్లలేదు...

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జాతిరత్నాలు’ సినిమాలో కేక్ పెట్టలేదని తన బావ అయిన మినిస్టర్‌నే చంపడానికి ప్రయత్నిస్తాడు ఓ వ్యక్తి. దాన్ని హసన్ ఆలీకి లింక్ చేస్తూ... ‘కేక్ పెట్టనందుకే క్యాచ్ డ్రాప్ చేశాడంటూ’ మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి...

హసన్ ఆలీ క్యాచ్ డ్రాప్ చేసినా అప్పటికి ఆస్ట్రేలియా విజయానికి 9 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది. అది అంత తేలికైన లెక్కేమీ కాదు. ఓవర్ కాన్పిడెన్స్‌తో షాహీన్ ఆఫ్రిదీ వేసిన బౌలింగ్‌ను మాథ్యూ వేడ్ చక్కగా ఉపయోగించుకుని సిక్సర్లుగా మలిచాడు...

కేవలం ఈ మూడు సిక్సర్లకు ముందు హసన్ ఆలీ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల అతను ట్రోలింగ్‌కి కారణమయ్యాడు. ఆ బంతి క్యాచ్‌గా వెళ్లకపోయి ఉంటే, షాహీన్ ఆఫ్రిదీయే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది...

హసన్ ఆలీ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతని భార్య సమీయో అర్జో ఇన్‌స్టా అకౌంట్‌పై అసభ్యమైన కామెంట్లతో దాడి చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్... 

సమీయో అర్జో భారతీయురాలు కావడం కూడా పాక్ ఫ్యాన్స్, ఆమెను టార్గెట్ చేయడానికి కారణమైంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో మహ్మద్ షమీపై కూడా ఇలాగే విద్వేషం వెల్లగక్కారు క్రికెట్ ఫ్యాన్స్...

అప్పుడు కొందరు పాకిస్తాన్ క్రికెటర్లు, ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే హసన్ ఆలీ విషయంలో, అతని భార్యపై జరుగుతున్న సైబర్ అటాక్‌ గురించి ఇప్పటిదాకా పాక్ క్రికెటర్లు స్పందించకపోవడం విశేషం...

click me!