ఇండియాలోనే ఐపీఎల్ 2022 సీజన్... మార్చి నెలాఖరున ప్రారంభం... బీసీసీఐ సెక్రటరీ జై షా...

Published : Nov 20, 2021, 07:23 PM IST

క్రికెట్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. కరోనా కారణంగా గత రెండు సీజన్లు (2020లో పూర్తిగా, 2021లో సగం సీజన్) యూఏఈలో జరిగినా, వచ్చే ఏడాది మాత్రం భారత్‌లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పండగ జరుగుతుందని ప్రకటించాడు...

PREV
112
ఇండియాలోనే ఐపీఎల్ 2022 సీజన్... మార్చి నెలాఖరున ప్రారంభం... బీసీసీఐ సెక్రటరీ జై షా...

ఐపీఎల్ 2022 సీజన్‌‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీలు ఆరంగ్రేటం చేయనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్, లక్నో నగరాల పేర్లతో రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ జట్ల సంఖ్య 10కి చేరింది...

212

కొత్త ఫ్రాంఛైజీల ఎంట్రీతో ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం జరగనుంది. త్వరలోనే ఈ మెగా వేలానికి సంబంధించిన రూల్స్‌ను ప్రకటించనుంది బీసీసీఐ...

312

పాత ఫ్రాంఛైజీలు అత్యధికంగా నలుగురు ప్లేయర్లను (అత్యధికంగా ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు, అత్యధికంగా ఇద్దరు విదేశీ ప్లేయర్లను) మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది...

412

కొత్త జట్లకు కూడా ‘ఫ్రీ టికెట్’ ద్వారా వేలానికి ముందు ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది బీసీసీఐ. 8 కాస్తా 10 జట్లు కావడంతో ఇన్నాళ్లు 60 రోజుల పాటు సాగిన ఐపీఎల్ మహా సంగ్రామం, వచ్చే ఏడాది నుంచి 74 రోజుల పాటు సాగనుంది. 

512

‘త్వరలోనే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సంబంధించిన నియమాలను విడుదల చేస్తాం. ఇంతకముందుతో పోలిస్తే, మరింత ఆసక్తికరంగా ఐపీఎల్‌ను మార్చబోతున్నాం. వచ్చే ఏడాది భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తాం...’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

612

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ఉన్న సమయంలో యూఏఈ వేదికగా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించి, సూపర్ హిట్ చేసింది బీసీసీఐ...

712

కరోనా కేసులు తగ్గడంతో ఐపీఎల్ 2021 సీజన్‌, భారత్‌లో ప్రారంభమైంది. బయో బబుల్‌ ఏర్పాటు చేసి, ఎంపిక చేసిన ఆరు ప్రధాన నగరాల్లోనే మ్యాచులు నిర్వహించాలని ఐపీఎల్ యాజమాన్యం భావించింది...

812

అయితే 29 మ్యాచులు ముగిసిన తర్వాత బయో బబుల్‌లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో అర్ధాంతంగా ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

912

సరిగా టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీకి ముందు ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచులు జరిగాయి. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో జరిగిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ కారణంగా బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది...

1012

ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో వచ్చిన వందల కోట్ల నష్టాన్ని, సెకండ్ ఫేజ్‌తో పూడ్చుకున్న బీసీసీఐ, మరో రెండు వందలకోట్లకు పైగా లాభాలను కూడా ఆర్జించింది...

1112

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్ల వేలం ద్వారా దాదాపు 12 వేల కోట్ల ఆదాయాన్ని అందుకున్న బీసీసీఐ, ప్రసార హక్కుల ద్వారా మరో రూ.36 వేల కోట్ల రూపాయాలను ఖజానాలో నింపుకోబోతోంది...

1212

అయితే ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌ని, టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముందు నిర్వహించడం వల్ల ఆ ప్రభావం భారత జట్టు ప్రదర్శనపై తీవ్రంగా పడింది. మొదటి రెండు మ్యాచుల్లో అలసిపోయి ఆడినట్టు కనిపించిన భారత ప్లేయర్లు, గ్రూప్ స్టేజీకి పరిమితమయ్యారు.

click me!

Recommended Stories