టీ20 వరల్డ్‌కప్ 2021 ఎఫెక్ట్... టీమిండియా సెలక్షన్‌లో వారిపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన బీసీసీఐ...

Published : Nov 06, 2021, 08:53 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మిగిలిన జట్లతో పోలిస్తే టీమిండియా ఓ విషయంలో చాలా వెనకబడినట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది. టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్, వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా... భారత జట్టులో ఆల్‌రౌండర్ల కొరత స్పష్టంగా కనిపించింది...

PREV
110
టీ20 వరల్డ్‌కప్ 2021 ఎఫెక్ట్... టీమిండియా సెలక్షన్‌లో వారిపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన బీసీసీఐ...

పాకిస్తాన్‌తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, స్పెషలిస్ట్ బౌలర్ల కంటే ఆల్‌రౌండర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది... అందుకే వారి బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా చాలా డెప్త్ ఉంటుంది...

210

టీమిండియా పరిస్థితి మాత్రం పూర్తిగా డిఫరెంట్. భారత జట్టులో ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఓ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మాత్రమే ఉన్నారు. హార్ధిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటిదాకా వికెట్ తీయలేకపోయారు...

310

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో బౌలింగ్ చేసినా వికెట్ తీసింది లేదు. అందుకే పాండ్యా పేరుకే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా, పూర్తి స్థాయి స్పెషలిస్ట్ హిట్టర్‌గా మారాడు...

410

రవీంద్ర జడేజా పరిస్థితి కూడా దాదాపు అదే. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయలేకపోయిన రవీంద్ర జడేజా, భారీగా పరుగులు సమర్పించాడు... బ్యాటింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులు చూసే అవకాశం దొరకలేదు...

510

అలా చూసుకుంటే భారత జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నా, వారి నుంచి ఆల్‌‌రౌండ్ పర్ఫామెన్స్ వస్తున్న సందర్భాలు చాలా తక్కువ. దీంతో ఇకపై జట్టు ఎంపిక సమయంలో ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని భావిస్తోంది బీసీసీఐ...

610

ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో సత్తా చాటిన ఆల్‌రౌండర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చూస్తోంది. సిక్సర్ల మోత మోగించి సెంచరీలు చేసే బ్యాట్స్‌మెన్‌‌కి బౌలింగ్‌లో వికెట్ తీయగల సత్తా ఉంటే, కళ్లకు అద్దుకుని జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది...

710

ఐపీఎల్ 2021 సీజన్‌లో అలాంటి టాలెంట్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు వెంకటేశ్ అయ్యర్. సెకండ్ ఫేజ్‌లో ఓపెనర్‌గా కేకేఆర్ జట్టుకి అద్భుత విజయాలు అందించిన అయ్యర్, బౌలింగ్‌లో 140+ వేగంతో బంతులు విసిరి వికెట్లు తీశాడు...

810

అలాగే సీజన్‌లో 32 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో రికార్డు సమం చేసిన హర్షల్ పటేల్, హర్యానా తరుపున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వస్తాడు. అతనిపై కూడా ఫోకస్ పెడుతోంది బీసీసీఐ...

910

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఈ ఇద్దరి పర్ఫామెన్స్‌ని బట్టి న్యూజిలాండ్ సిరీస్ తర్వాత జరిగే సౌతాఫ్రికా టూర్‌లో ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది బీసీసీఐ...

1010

ఈ ఇద్దరితో పాటు బ్యాటుతో, బంతితో సత్తా చాటే యంగ్ ఆల్‌రౌండర్లను గుర్తించి, వారిని రాటుతేల్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది భారత క్రికెట్ బోర్డు... ఆల్‌రౌండర్లతో జట్టును నింపితే బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం కావడంతో పాటు బౌలింగ్ ఆప్షన్లు కూడా పెరుగుతాయని భావస్తోందని సమాచారం...

click me!

Recommended Stories