కొత్త ఫార్మాట్‌లో పొట్టి ప్రపంచకప్.. వచ్చేసారి అంతకుమించిన మజా..

First Published Nov 23, 2022, 10:29 AM IST

T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్  8వ ఎడిషన్ ఇటీవలే ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన ఈ టోర్నీ.. తర్వాత ఎడిషన్ 2024లో జరుగుతుంది.  వచ్చే ప్రపంచకప్ కోసం ఐసీసీ కొత్త ఫార్మాట్ తీసుకొచ్చింది. 

క్రికెట్ అభిమానులను అత్యంత అలరిస్తున్న  టీ20 క్రికెట్ లో ప్రపంచకప్ కు ఉండే క్రేజే వేరు. ప్రతీ రెండేండ్లకోసారి జరిగే టీ20  ప్రపంచకప్  టోర్నీ కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా వేదికగా అలరించింది.   వచ్చే ప్రపంచకప్ 2024లో  అమెరికా, వెస్టిండీస్ దీవుల  వేదికగా జరగాల్సి ఉంది. 

Image credit: Getty

ఈ టోర్నీ కొత్త ఫార్మాట్ లో జరగాల్సి ఉంది. గత రెండు  ఎడిషన్లు (2021, 2022) మొదట క్వాలిఫయర్ రౌండ్లు నిర్వహించి తర్వత  సూపర్  -12 దశను నిర్వహించిన విషయం తెలిసిందే.  మొత్తం 16 జట్లతో ఈ రెండు ఎడిషన్లు జరిగాయి. 
 

కానీ  వచ్చే  వరల్డ్ కప్ లో మాత్రం  20 జట్లు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్ లో  టోర్నీ జరగాల్సి ఉంది. దీనికోసం  ఐసీసీ కొత్త ఫార్మాట్ వివరాలను  వెల్లడించింది.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Image credit: Getty

20 జట్లు  కలిసి  ఆడనున్న ఈ టోర్నీలో టీమ్ లను  నాలుగు గ్రూపులుగా విడగొడతారు. ఒక్కో గ్రూప్ లో ఐదు టీమ్ లు ఉంటాయి.  ఈ గ్రూప్ లో  ప్రతీ గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ -8 దశకు చేరుకుంటాయి. 

Image credit: Getty

సూపర్ - 8లో కూడా రెండు గ్రూపులుంటాయి.   నాలుగు జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి  ఆడతాయి.  ఇక్కడ కూడా గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీస్ కు చేరుకుంటాయి.  సెమీస్ విజేతలు (రెండు జట్లు) ఫైనల్ లో తలపడతాయి. 
 

Image credit: Getty

వెస్టిండీస్, యూఎస్ఎ లు ఆతిథ్యమివ్వనున్న  ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 జట్లు బెర్తులు ఖాయం చేసుకున్నాయి. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  టాప్ -8లో ఉన్న ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్  అర్హత సాధించగా ఐసీసీ ర్యాంకింగుల మేరకు బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ కూడా క్వాలిఫై అయ్యాయి. 

Image credit: Getty

ఆతిథ్య దేశాలు గనక వెస్టిండీస్, యూఎస్ఎ కూడా టోర్నీకి అర్హత సాధించాయి. మిగిలిన 8 జట్లను  రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.   అయితే 2022లో క్వాలిఫై అయి  పాకిస్తాన్ కు షాకిచ్చిన జింబాబ్వే..  2024లో క్వాలిఫై రౌండ్ ఆడాల్సి ఉంటుంది. 

click me!