టీ20 సిరీస్ ముగిసింది! ఇక ఇంటికి హార్ధిక్ పాండ్యా... ధావన్ అయినా కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తాడా...

First Published Nov 22, 2022, 5:51 PM IST

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ సజావుగా సాగితే ఓ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా, మరో మ్యాచ్ టైగా ముగిసింది. టీ20 సిరీస్ ముగియడంతో వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది భారత జట్టు... పొట్టి ఫార్మాట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన క్రికెటర్లు, వన్డే సిరీస్‌లో అయినా ఛాన్స్ వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

న్యూజిలాండ్ గడ్డ మీద టీ20 సిరీస్ నెగ్గిన రెండో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. రెండేళ్ల తర్వాత హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో 1-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది భారత జట్టు...

Image credit: PTI

టీ20 సిరీస్ ముగియడంతో హార్ధిక్ పాండ్యా స్వదేశానికి వెళ్లబోతున్నాడు. టీ20 కెప్టెన్ పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్,  హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ స్వదేశానికి తిరిగి రానున్నారు. వీరిలో హార్ధిక్ పాండ్యా, హర్షల్ పటేల్, భువీ టీ20 వరల్డ్ కప్ ఆడగా సిరాజ్ రిజర్వు ప్లేయర్‌గా వ్యవహరించాడు....

వన్డే టీమ్‌కి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో షాబాజ్ అహ్మద్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాళ్లు కూడా ఉన్నారు. వీరిలో దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి సెలక్టర్లను మెప్పించి... టీమిండియాలోకి వచ్చిన కుల్దీప్ సేన్ అంతర్జాతీయ ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నాడు...

Shreyas Iyer-Shubman Gill

వీరితో పాటు టీ20 టీమ్‌కి ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు కూడా వన్డే టీమ్‌లో అయినా ఛాన్స్ దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే వన్డే టీమ్‌లో కూడా రిషబ్ పంత్ నుంచి విపరీతమైన పోటీ ఎదుర్కోబోతున్నాడు సంజూ శాంసన్...

Sanju Samson-Shreyas Iyer

వన్డే టీమ్‌కి రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ కూడా. కాబట్టి పంత్ జట్టులో ఉండడం పక్కా. అలాగే శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు గాయం నుంచి కోలుకున్న దీపక్ చాహార్‌... వన్డే టీమ్‌లో ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని మోయబోతున్నారు...

Sanju Samson

వీరి మధ్యలో ఉమ్రాన్ మాలిక్‌కి తుదిజట్టులో చోటు దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో పెద్దగా రాణించకపోయినా వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్‌కి మంచి రికార్డు ఉంది. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తారు. వీరి మధ్యలో సంజూ శాంసన్‌కి చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి... 

click me!