ఒక్క మ్యాచ్ ఓడిపోగానే టీమ్ మొత్తాన్ని మార్చాలని చెప్పడం కరెక్ట్ కాదు... టీమిండియాకి సునీల్ గవాస్కర్ సపోర్ట్...

First Published Nov 12, 2022, 3:46 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత టీమిండియాపై, బీసీసీఐపై విపరీతమైన ట్రోలింగ్ వస్తోంది. ‘చోకర్స్’ అని, పవర్ ప్లేలో బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియని జిడ్డుగాళ్లంటూ టీమిండియాని తిడుతున్నారు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు. సునీల్ గవాస్కర్ మాత్రం భారత జట్టుకు అండగా నిలిచాడు...

Image credit: Getty

సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ జిడ్డు బ్యాటింగ్‌నే కారణంగా చూపిస్తున్నారు అభిమానులు. ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదని, పవర్ ప్లేలో ఎలా బ్యాటింగ్ చేయాలో కూడా వీళ్లకి తెలియడం లేదని కామెంట్లు చేస్తున్నారు...

Team India

ఓపెనర్లతో పాటు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ కూడా ట్రోలింగ్‌ని ఎదుర్కొంటున్నారు. ఇంత అనుభవం ఉన్న భువీ, షమీ... సెమీస్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయారా? అంటూ తిడుతున్నారు.. రిషబ్ పంత్‌ని కూడా ట్రోలర్స్ వదిలిపెట్టడం లేదు...

Team India

‘మనం ఓడిపోయింది ఒకే ఒక్క మ్యాచ్... ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన టీమ్ మొత్తాన్ని సమూలంగా మార్చేయాలని అనడం కరెక్ట్ కాదు. ఒకేసారి టీమ్‌లో చాలా మార్పులు చేసినా అసలుకే మోసం వస్తుంది. ఇలాంటి సమయాల్లోనే టీమ్‌కి సపోర్ట్ కావాలి...

team India

అవును, నిజమే.. టీమిండియా, ఐసీసీ టోర్నీల్లో సరైన ప్రదర్శన ఇవ్వాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకుంటుందనే నమ్ముతున్నా... సెలక్షన్ కమిటీ కూడా ప్లేయర్ల ఎంపికలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి...

Team India

పవర్ ప్లలో మన ఓపెనర్లు పరుగులు చేయలేకపోయారు. అదే పవర్ ప్లేలో మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. పవర్ ప్లేలోనే ఇంగ్లాండ్ గెలిచేసింది. ఇకనైనా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే కేవలం ఐపీఎల్ ట్రాక్ రికార్డు కాకుండా దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ చూసి ప్లేయర్లను సెలక్ట్ చేయాలి... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్... 

Hardik Pandya, rohith sharma

రోహిత్ శర్మను తప్పించి హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని, ఓపెనర్లుగా పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి యంగ్ ప్లేయర్లకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. భువీని తప్పించి ఉమ్రాన్ మాలిక్‌కి చోటు కల్పించాలని కోరుతున్నారు. 

click me!