ఐపీఎల్‌‌లో కోట్లు కుమ్మరిస్తున్నారు! కుర్రాళ్లకి కష్టం ఎలా తెలుస్తుంది... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్..

First Published | Nov 12, 2022, 3:21 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఓటమితో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)పై, ఐపీఎల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వరుసగా ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అవుతుండడానికి ఐపీఎల్‌నే కారణంగా చూపిస్తున్నారు చాలామంది మాజీ క్రికెటర్లు...

Image credit: Getty

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 1 పరుగు తేడాతో ఓడిన తర్వాత కూడా లక్ కలిసి రావడంతో ఫైనల్‌కి వెళ్లిపోయింది పాకిస్తాన్. అదే టేబుల్ టాపర్‌గా నిలిచిన ఇండియా మాత్రం ఇంగ్లాండ్ చేతుల్లో వెళ్లి, సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది...

Image credit: PTI

‘ఆసియా కప్‌లోనే నేను భారత బౌలర్ల బౌలింగ్‌ని గమనించా. ఐపీఎల్ అయిపోయాగే వారి బౌలింగ్‌ మారిపోతోంది. ఆవేశ్ ఖాన్‌ని తీసుకోండి, ఐపీఎల్‌లో అతను 145 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. టీమిండియాకి రాగానే అతని బౌలింగ్ 130-135కి పడిపోయింది...

Latest Videos


ఐపీఎల్ అవ్వగానే బౌలింగ్ స్పీడ్ ఎందుకు తగ్గిపోతోంది. బీసీసీఐ దీనికి కారణాలు కనుక్కోవాలి. ఐపీఎల్‌లో అతనికి రూ. 12 కోట్లు ఇచ్చారు. నెల రోజుల కష్టపడితే రూ.12 కోట్లు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు వారికి ఆకలి గురించి ఎలా తెలుస్తుంది, కష్టం గురించి ఎలా తెలుస్తుంది...

అందుకే ఐపీఎల్ అయిపోయాగే రిలాక్స్ అయిపోతున్నారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదని మెంటల్‌గా ఫిక్స్ అయిపోతున్నారు. అంటే వాళ్లకి అన్ని కోట్లు ఇచ్చి మీరే పాడుచేస్తున్నారు. నేను ఆడినప్పుడు కానీ, కోచ్‌గా పనిచేసినప్పుడు కానీ ప్లేయర్లను రిలాక్స్ అవ్వనిచ్చేవాడిని కాదు...

Team India

బౌలింగ్ వేగం తగ్గితే ఫ్యూచర్ ఉండదని హెచ్చరించేవాడిని. టీమ్‌లో చోటు ఉండాలంటే స్పీడ్ తగ్గకూడదని గట్టిగా చెప్పేవాడిని. పేస్ ఉంటే మిగిలిన వాటిని ఈజీగా నేర్చుకోవచ్చు. పేస్ లేకపోతే ఫాస్ట్ బౌలర్‌గా సక్సెస్ అవ్వడమే కష్టం... 

Image credit: PTI

అయితే ఇప్పుడు కోచ్‌లు అలా లేరు. ముఖ్యంగా టీమిండియా క్యాంప్ చూస్తుంటే వాళ్లు పేస్‌ని అస్సలు పట్టించుకుంటున్నట్టు లేదు. బౌలర్లు ఏ స్పీడ్‌తో బౌలింగ్ చేసినా వాళ్లు పట్టించుకోరు, వికెట్లు తీయకపోయినా కేర్ చేయరు. కేవలం ఎక్కువగా పరుగులు ఇవ్వకపోతే చాలు... టీమ్‌లో ఆడనిస్తారు. ఇదే టీమిండియాని నాశనం చేస్తోంది...

team India

మేం టెస్టు మ్యాచ్ ఆడే సమయంలో కీ బౌలర్లకు ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని అనేవాళ్లు. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఆరంభంలోనే బౌలింగ్‌కి వచ్చేవాడు. అతన్ని బౌలింగ్ చేయమని ఎవ్వరూ చెప్పేవాళ్లు కాదు. అయినా టీమ్ కోసం ఆలోచించేవాడు..ఇప్పుడు టీమిండియాలో అలాంటి వాళ్లు కనిపించడం లేదు...

Image credit: Getty

నేను నాలుగు ఓవర్లు వేయాలి, వేశానా... నా పని అయిపోయిందా... అన్నట్టే నేటి బౌలర్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ధోరణి ఉంటే ఏ జట్టూ కూడా సక్సెస్ కాలేదు. వరల్డ్ కప్ గెలవలేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో ఇప్పటికే బీసీసీఐకి అర్థమై ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్.. 

click me!