19 ఏళ్లలో ధోనీ లేకుండా మొట్టమొదటిసారి ఐసీసీ నాకౌట్ మ్యాచ్... టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి...

First Published | Nov 9, 2022, 1:11 PM IST

టీమిండియా క్రికెట్ చరిత్ర గురించి చెప్పాలంటే ధోనీకి ముందు, ధోనీ తర్వాత అని రెండు భాగాలుగా విడదీసి చెప్పాలంటారు క్రికెట్ ఫ్యాన్స్. కాస్త అతిశయోక్తిగా అనిపించినా భారత క్రికెట్‌పై ధోనీ వేసిన మార్క్ అలాంటిది. 2004లో టీమిండియాలోకి వచ్చిన ధోనీ, 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ప్లేయర్‌గా, స్టార్ మేకర్‌గా మారిపోయాడు...

ms dhoni

ఎలాంటి అంచనాలు లేకుండా, స్టార్ క్రికెటర్లు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఆడిన ధోనీ సేన, మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి టీమిండియా ఆడిన ప్రతీ వైట్ బాల్ ఐసీసీ టోర్నీలోనూ సభ్యుడిగా ఉంటూ వచ్చాడు ధోనీ...

కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2009, 2010, 2012, 2014, 2016 టోర్నీల్లో టీమిండియాని నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ... 2011, 2015, 2019 వన్డే వరల్ కప్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన ధోనీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాభవానికి సాక్షిగా నిలిచాడు...


2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ధోనీ లేకుండా 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడింది. అయితే 2021 టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించాడు.

టీమిండియా సెలక్షన్ దగ్గర్నుంచి బ్యాటింగ్ ఆర్డర్ దాకా అన్ని విషయాలు మాహీ వేలు పెట్టాడని సెలక్టర్లు కామెంట్లు చేశారు... బౌలింగ్ వేసేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించకపోయినా హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడడానికి ధోనీయే కారణమని సెలక్షన్ కమిటీలో ఓ సభ్యుడు కామెంట్ చేశాడు... 

టీ20 వరల్డ్ కప్ 2021 పరాభవంతో మహేంద్ర సింగ్ ధోనీపై కూడా విమర్శలు వచ్చాయి. మాహీ లేకపోయి ఉంటే టీమిండియా, వరల్డ్ కప్ గెలవకపోయినా కనీసం పాక్‌తో మ్యాచ్‌లో అయినా గెలిచేదని, కామెంట్లు చేశారు. మాహీని తీసుకొచ్చి, టీమిండియాని నిలువునా ముంచారని కామెంట్లు చేశారు. ఈ ఎఫెక్ట్‌తో ఈసారి మాహీ, టీమిండియాకి దూరంగా ఉన్నాడు... 

19 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. వాస్తవానికి ధోనీ లేకుండా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా. అయితే అది రెడ్ బాల్ ఫార్మాట్... 

మాహీ టెస్టుల నుంచి ఎప్పుడో రిటైర్మెంట్ తీసుకోవడంతో అది లెక్కలోకి రాదు. వైట్ బాల్ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన మహేంద్రుడు ఏ రకంగానూ ఈసారి టీమిండియాకి అందుబాటులో లేడు. ఇన్నాళ్లు ధోనీ మాత్రమే ఐసీసీ టైటిల్స్ గెలవగలడు అనే ముద్రను రోహిత్ శర్మ చెరిపేస్తాడా? అనేది మరో మ్యాచ్ లేదా రెండు మ్యాచుల్లో తేలిపోనుంది..

Latest Videos

click me!