తొలి 12 ఓవర్లు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ఐర్లాండ్,103/1 పరుగుల స్కోరు చేసింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 157 పరుగులకి పరిమితమైనా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఐర్లాండ్ బౌలర్లు. జోస్ బట్లర్ డకౌట్ కాగా అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు.