సింగపూర్ సెన్సేషన్ టిమ్ డేవిడ్ ఎంట్రీతో స్టీవ్ స్మిత్, తుది జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి మూడు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన స్టీవ్ స్మిత్... ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌తో పాటు ఆరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ గాయపడడంతో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడడం ఖాయమైపోయింది.
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, రెండు క్యాచులు అందుకుని ఆస్ట్రేలియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అవకాశం వస్తే తాను విరాట్ కోహ్లీలాంటి ఇన్నింగ్స్‌లు ఆడతానని అంటున్నాడు...
‘విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్‌లో ఆడిన ఇన్నింగ్స్ చాలా స్పెషల్. మిగిలిన ప్లేయర్లు అందరూ దాదాపు చేతులు ఎత్తేసినప్పుడు విరాట్ కోహ్లీ వీరోచితంగా పోరాడాడు. నేను కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడగలను...
నేను ఇప్పుడు టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోతున్నా. అయితే ఫార్మాట్ ఏదైనా దానికి తగ్గట్టుగా ఆడినప్పుడే గొప్ప బ్యాటర్ కాగలరు. ఈ టోర్నమెంట్ సాగుతున్న విధానం, ఈ వికెట్స్ బ్యాటర్లకు సహకరిస్తున్న విధానంపై నాకు పూర్తి క్లారిటీ ఉంది...
ఆస్ట్రేలియా గ్రౌండ్స్, మిగిలిన దేశాల గ్రౌండ్స్ కంటే పెద్దగా ఉంటాయి. హిట్టర్లు కూడా ఇక్కడ బౌండరీలు కొట్టేందుకు బాగా కష్టపడాల్సిందే. అదే ఇక్కడి గ్రౌండ్స్ గురించి ఐడియా ఉన్నవారికి, ఎలా బౌండరీలు సాధించాలో ఐడియా ఉంటుంది. అది నాకు బాగా తెలుసు...
ఎలాగోలా తుదిజట్టులోకి రావడం కోసమే ఎదురుచూస్తున్నా. అవసరమైతే హిట్టర్‌గా మారి మ్యాచ్ ఫినిష్ చేసేందుకు కూడా నేను సిద్ధం. నాకున్న అపార అనుభవాన్ని మ్యాచులు గెలిపించేందుకు ఉపయోగిస్తా. టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఉన్నా, ఆస్ట్రేలియాకి కెప్టెన్‌గానూ చేశా. ఆ అనుభవం, టీ20ల్లో ఆడడానికి సరిపోతుందని అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్..