ఈ ఓటమి తర్వాత వాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారు... సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్లు ఎవరి గురించి...

First Published | Nov 11, 2022, 12:43 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది. భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు, టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది భారత జట్టు.. 

Image credit: PTI

బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించి మంచి స్కోరు అందించినా వికెట్లు తీసి, ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేయడంలో భారత బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ఈ పరాజయంతో కొందరు భారత క్రికెటర్లు రిటైర్మెంట్లు ప్రకటిస్తారని షాకింగ్ కామెంట్లు చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

‘ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, టీమిండయా తర్వాతి కెప్టెన్‌గా సీటు రిజర్వు చేసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా త్వరలో కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడు. ఈ ఓటమి తర్వాత కొన్ని రిటైర్మెంట్ ప్రకటనలు వస్తాయి...

Latest Videos


ఇలాంటి ఓటమి తర్వాత ఆటగాళ్లు చాలా ఒత్తిడిలోకి వెళ్తారు. ఎంతో మానసిక ఘర్షణకు గురవుతారు. ఇప్పటికే 30 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది టీమ్‌లో ఉన్నారు. వారిలో కొందరు టీ20 టీమ్‌లో తన ప్లేస్ గురించి ఇంకోసారి ఆలోచనలు చేయొచ్చు... రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అనుకోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

Virat Kohli-Rohit Sharma

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గురించే సునీల్ గవాస్కర్ పరోక్షంగా ఇలాంటి కామెంట్లు చేసి ఉంటాడని అర్థమవుతోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రోహిత్ శర్మ బ్యాటర్‌గా, కెప్టెన్‌గానూ ఫెయిల్ అయ్యాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన రోహిత్, సెమీ ఫైనల్‌లోనూ ఫెయిలై టీమిండియా ఓటమికి కారణమయ్యాడు...

Image credit: Getty

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మతో పాటు అదే టోర్నీలో ఆడిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌ తర్వాత టీమిండియాలోకి వచ్చిన దినేశ్ కార్తీక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు మ్యాచులు ఆడి మెరుపులు మెరిపించలేకపోయాడు...

ఈ ఇద్దరితో పాటు వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుని, వన్డే, టెస్టు ఫార్మాట్‌లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని టాక్ వినబడుతోంది..

అలాగే నాలుగేళ్ల తర్వాత అనుకోకుండా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ద్వారా పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలిగే అవకాశాలున్నాయి. మొత్తానికి ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ టోర్నీ, భారత జట్టులోని కొందరు ప్లేయర్లకు ఆఖరి పొట్టి ప్రపంచకప్‌గా మారనుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  

click me!