అతని ఎంట్రీతోనే దరిద్రం పట్టుకుంది... ధోనీ వల్లే కాలేదు! ఇక కోహ్లీ, రోహిత్ ఏం చేయగలరు...

First Published | Nov 11, 2022, 12:06 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాకౌట్ పోరులో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత 9 ఏళ్లుగా టీమిండియాని దరిద్రం వెంటాడుతూనే ఉంది... 

చాలామంది ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, టీ20 వరల్డ్ కప్ గెలిచేవాళ్లమని కామెంట్లు చేస్తున్నారు. అయితే 20007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనీ కెప్టెన్సీలో టీమిండియా... ఐసీసీ టోర్నీల్లో చాలా వాటిల్లో ఫ్లాప్ అయ్యింది.

ms dhoni

2009 టీ20 వరల్డ్ కప్, 2010, 2012 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయింది భారత జట్టు.అయితే మధ్యలో 2011లో వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధోనీ ఈ వైఫల్యాలను జనాలు పట్టించుకోలేదు...


ముఖ్యంగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత 2014లో టీమిండియాకి దరిద్రం పట్టుకుంది. 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఫైనల్ చేరిన ధోనీ సేన, ఆఖరాటలో శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడింది...

dhoni

2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాహీ కెప్టెన్సీలో సెమీ ఫైనల్‌కి ప్రవేశించిన భారత జట్టు, వెస్టిండీస్ చేతుల్లో పరాజయం పాలైంది. ఈ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఫైనల్ చేరింది భారత జట్టు...

MS Dhoni

అయితే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమిండియా. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీలో 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది కోహ్లీ సేన. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయింది... 

2021 టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా... విజయ తీరాలకు అడుగు తీరంలో నిలిచింది. ఇక లాభం లేదని విరాట్ కోహ్లీ... ఐసీసీ టైటిల్ గెలవలేడని ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ...

K L Rahul

అయితే ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కూడా టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందించలేకపోయాడు. మొత్తంగా చూస్తుంటే 2014 నుంచే టీమిండియాకి దరిద్రం పట్టుకుందని... ఆ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కెఎల్ రాహుల్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

KL Rahul

ఐపీఎల్‌లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన కెఎల్ రాహుల్, ప్రీమియర్ లీగ్‌లో పరుగులు చేస్తూ... ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. కెఎల్ రాహుల్ ఎంట్రీ తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి అతని పర్ఫామెన్స్ కూడా ఓ కారణమని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

Image credit: Getty

సౌతాఫ్రికాలో కెప్టెన్‌గా వన్డే సిరీస్‌లో టీమిండియాని వైట్ వాష్ చేయించిన కెఎల్ రాహుల్, ప్రస్తుతం భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీసీసీఐ, రోహిత్ శర్మ తర్వాత రాహుల్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించొచ్చు. మూడు టైటిల్స్ గెలిచిన ధోనీయే.. రాహుల్ వచ్చాక ఐసీసీ టైటిల్ గెలవలేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఏం చేయగలరని మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. 

Latest Videos

click me!