సౌరవ్ గంగూలీ పదవి తొలగింపు వెనక ధోనీ హస్తం!? చక్రం తప్పిన చెన్నై సూపర్ కింగ్స్ యజమాని...

First Published Oct 13, 2022, 5:41 PM IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంత రాజసం అనుభవించాడో బీసీసీఐ బాస్‌గానూ అలాగే స్టేటస్‌నే ఆస్వాదించాడు సౌరవ్ గంగూలీ. అయితే అక్కడ ఎలాగైతే బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో, బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి కూడా అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది సౌరవ్ గంగూలీ. ‘దాదా’ పదవి ఊడడం వెనక జై షా హస్తం ఉందని టాక్ వినబడుతున్నా, అసలు కథ నడిపించింది మాత్రం వేరే వ్యక్తి అట...

ప్రపంచమంతా కరోనా కల్లోలం రేగుతున్న సమయంలో ఐపీఎల్ 2022 సీజన్‌ని విజయవంతంగా నిర్వహించి, ‘శభాష్’ అనిపించుకున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. కరోనా కారణంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించలేమని చేతులు ఎత్తేస్తే అదే సమయంలో ఐపీఎల్‌ని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలిగాడు గంగూలీ...

Sourav Ganguly-Jay shah

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి బ్రేక్ పడినా, దాన్ని రెండు ఫేజ్‌లుగా పూర్తి చేసి బీసీసీఐకి లాభాల పంట పండించాడు. ఐపీఎల్ 2022లో 2 కొత్త ఫ్రాంఛైజీలను ప్రవేశపెట్టి దాదాపు రూ.15 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన బీసీసీఐ బాస్, 2023-27 ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయం  ద్వారా రూ.43 వేల కోట్లతో ఖజానాని నింపేశాడు...

ఇంత చేసినా బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని కొనసాగించడానికి భారత క్రికెట్ బోర్డు సభ్యులు ఇష్టపడలేదు. భారత క్రికెట్‌లో ‘దాదా గిరి’ ఎక్కువయ్యిందని, అతన్ని బలవంతంగా ఆ పదవి నుంచి దింపేశారు. అయితే గంగూలీ తొలగింపు వెనకాల చక్రం తిప్పింది ఎవరో కాదు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్...

బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్ శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ పనితనం విషయంలో విమర్శలు గుప్పించారట. అతని స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐ సమావేశంలో గట్టిగా వాదన వినిపించారట. సీఎస్‌కే బాస్ ఏం చేసినా దాని వెనక మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయం...

ganguly dhoni

మరి మాహీకి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ఎందుకు ఇంత కక్ష? అంటే... ప్రత్యేకంగా ఈ ఇద్దరి మధ్య పాత పగలేమీ లేవు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా మాహీని పిలిచి మరీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి మెంటర్‌గా నియమించింది బీసీసీఐ... అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా వినబడుతోంది...

ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. సౌరవ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య విభేదాలే ఈ నిర్ణయానికి కారణమని బలంగా వార్తలు వినిపించాయి. తనకు ఈ నిర్ణయం గంట ముందు చెప్పారని కోహ్లీ, లేదు తనను తప్పుకోవద్దని వారించామని సౌరవ్ గంగూలీ... మీడియా ముందు వాదించారు. అప్పట్లో ఈ విషయం గురించి ప్రపంచ మీడియాలో చాలా పెద్ద చర్చే జరిగింది..

విరాట్ కోహ్లీకి, మహేంద్ర సింగ్ ధోనీకి మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ద్వారా ఎన్‌ శ్రీనివాసన్‌ని అస్త్రంగా వాడి, సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజం ఎంతుందో లేదో కానీ శ్రీనివాసన్ చేసిన పనితో, కోహ్లీ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్లు హ్యాపీ అవుతున్నారు...

ఇందులో నిజం ఎంతుంతో తెలీదు కానీ ఈ ఏడాదిలో బీసీసీఐలో జరుగుతున్న రాజకీయాలు, పైరవీల గురించి సోషల్ మీడియా ఈ స్థాయిలో చర్చ జరగడం ఇది రెండోసారి. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు బీసీసీఐలో జరుగుతున్న పరిణామాలు, జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతాయోమని సగటు భారత క్రికెట్ అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... 

click me!